Entertainment

దటీజ్ విజయ్ డెడికేషన్, గాయాలైనా నో బ్రేక్..

దటీజ్ విజయ్ డెడికేషన్, గాయాలైనా నో బ్రేక్..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది. కానీ మధ్యలో ఫ్యామిలీ స్టార్ వచ్చి పడింది. ఆ మూవీ ఫలితం విజయ్‌కి కాస్త అనుకూలంగానే వచ్చింది. ట్రోల్స్ ఎంత వచ్చినా బుల్లితెర, ఓటీటీలపై ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్ తన 12వ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. శ్రీలంక, కేరళ అంటూ విజయ్ బాగానే తిరుగుతున్నాడు. విజయ్ ప్రస్తుతం తన షూటింగ్‌లో గాయపడ్డాడు. భుజానికి గాయం అవ్వడంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

విజయ్ దేవరకొండకు తన సినిమాల పట్ల ఉండే అంకితభావం అందరికీ తెలిసిందే. సినిమా, తన పాత్ర కోసం అతను ఎంతో కష్టపడతాడు. తన వరకు వంద శాతం ఎఫెర్ట్ పెడుతుంటాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. లైగర్ లాంటి ఫ్లాప్ వచ్చినా, ఖుషి, ఫ్యామిలీ మ్యాన్ మంచి వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం విజయ్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌పై అందరికి భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని త్వరగా ఫినిష్ చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు

ఈ క్రమంలోనే షూటింగ్ సెట్‌లో విజయ్ గాయపడ్డాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో చిత్రీకరణలో ఉన్న విజయ్ భుజానికి గాయమైంది. దీంతో వెంటనే టీం విజయ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ఫిజియో థెరపీ చేయించారు. అదంతా జరిగాక విజయ్ వెంటనే షూటింగ్ సెట్‌లోకి వచ్చాడు. టైం ఎక్కువగా లేకపోవడంతో విశ్రాంతి తీసుకోకూడదని విజయ్ నిర్ణయించుకున్నాడు. అందుకే గాయమైనా కూడా షూటింగ్‌కు వచ్చేశాడని తెలుస్తోంది.

విజయ్ లాంటి హీరో గాయమైనా దర్శక, నిర్మాతలను ఆలోచించి రావడం గొప్ప విషయం. అసలు విజయ్ షూటింగ్‌కు రాకపోయినా లేదా బ్రేక్ తీసుకున్నా ఎవరూ ప్రశ్నించరు. కానీ విజయ్ మాత్రం అలా ఆలోచించలేదు. గాయమైనా షూటింగ్ చేయాలి అని వచ్చాడు. విజయ్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడతాడని అంతా ఫిక్స్ అయి ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి సైతం ఫస్ట్ టైం తన జానర్‌ను మార్చినట్టుగా కనిపిస్తోంది.

విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంది. పోలీస్, మాఫియా అంటూ ఈ కథ భారీ స్థాయిలోనే గౌతమ్ రాసుకున్నాడు. దానికి తగ్గట్టే శ్రీలంక, కొచ్చి వంటి ప్రదేశాల్లో ఈ మూవీని షూట్ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఆ తరువాత విజయ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీదకు వెళ్తాడు. రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా ప్రాజెక్టులు అయితే లైన్లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version