Entertainment

సూర్య ‘కంగువా’ కోసం ప్రభాస్‌… హోం బ్యానర్‌ కోసం వాయిస్‌ ఓవర్‌?

సూర్య ‘కంగువా’ కోసం ప్రభాస్‌… హోం బ్యానర్‌ కోసం వాయిస్‌ ఓవర్‌?

తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూర్య ‘కంగువా’ మూవీ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొన్నటి వరకు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తామంటూ చెబుతూ వచ్చిన మేకర్స్‌ చివరి నిమిషంలో రజనీకాంత్‌ వేట్టయన్‌ మూవీ కారణంగా వాయిదా

వేస్తున్నట్లు ప్రకటించారు. మరీ ఆలస్యం కాకుండా వచ్చే నెలలో సినిమాను 30కి పైగా భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ పీరియాడిక్‌

మూవీ ప్రమోషన్స్ మెల్లమెల్లగా షురూ అవుతున్నాయి. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి నిర్మించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ ప్రభాస్ కి హోం బ్యానర్‌ అనే విషయం తెల్సిందే. ప్రభాస్‌ సొంత వారు నిర్వహిస్తున్న ఆ బ్యానర్‌లో వచ్చే ప్రతి సినిమాకు ఆయన మద్దతు ఉంటుంది. కంగువా సినిమా కోసం ప్రభాస్‌ ఏం చేస్తారు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చెన్నై లో లేదా హైదరాబాద్‌లో జరగబోతున్న భారీ ఈవెంట్‌ కు ప్రభాస్ హాజరు అవుతారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కంగువా సినిమా కోసం ప్రభాస్ వాయిస్ ఓవర్‌ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలుగు వర్షన్‌ కోసం ప్రభాస్ తో ప్రత్యేకంగా వాయిస్‌ ఓవర్‌ ఇప్పించే

అవకాశాలు ఉన్నాయట. అందుకోసం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ప్రభాస్ తో కంగువాకి వాయిస్‌ ఓవర్‌ ఇప్పిస్తే కచ్చితంగా తెలుగు మార్కెట్‌లో సినిమాకు అనూహ్యంగా బిజినెస్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమిళ సినీ ప్రేమికులు కంగువా సినిమాను బాహుబలి స్థాయి మూవీ అంటున్నారు. తమిళ్‌ మీడియాలోనూ అదే ప్రచారం జరుగుతుంది. అలాంటి క్రేజీ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్‌ మరింత బలాన్ని చేకూర్చడం ఖాయం. ప్రభాస్‌ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా తన హోం బ్యానర్ కోసం, తన వాళ్ల కోసం కంగువా సినిమాకు వాయిస్ ఓవర్‌ ఇచ్చేందుకు సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ విషయమై యూవీ క్రియేషన్స్ నుంచి కానీ, చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే యూవీ క్రియేషన్స్‌ వారు స్పందించాల్సి ఉంది.

సూర్యను గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నమైన పాత్రలో దర్శకుడు శివ చూపించబోతున్నారట. బాలీవుడ్‌ స్టార్‌ దిశా పటానీ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ భారీ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. దాదాపుగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అంతకు మించి రాబట్టే అవకాశాలు ఉన్నాయని క్రేజ్‌ ని చూస్తే అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో డబ్బింగ్‌ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోలేక పోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ వాయిస్ ఓవర్‌ తో కంగువా సినిమా వచ్చి పాజిటివ్ టాక్ దక్కించుకున్నా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంగువా కోసం ప్రభాస్ ఏం చేస్తాడు అనేది చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version