Telangana
Golden Saree Weaves in Sircilla బంగారు చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేతన్న

మగ్గంపై అద్భుత కళాఖండం – బంగారు చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేతన్న – Golden Saree Weaves in Sircilla
Golden Saree Weaves in Sircilla : బంగారు చీరను చేనేత మగ్గంపై నేసి ఔరా అనిపించాడు సిరిసిల్లాకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్‌కుమార్. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం, 200 గ్రాముల బంగారంతో గోల్డ్ చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
తెలంగాణ ఎన్నో జానపదకళలకు, హస్తకళలకు నిలయం. ముఖ్యంగా మన రాష్ట్రంలోని చేనేత పరిశ్రమ ఎంతో పేరుగాంచింది. జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్తాయిలోను పలు అవార్డులను కైవసం చేసుకుంది. అగ్గిపెట్టేలో పట్టే చీరను నేసి అబ్బుర పరిచిన నేతన్నలు, తాజాగా బంగారు చీరను మగ్గంపై నేసి ఔరా అనిపించారు.
వివరాల్లోకెళ్తే.. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్, 200 గ్రాముల బంగారంతో బంగారు చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వారి కూతురి వివాహ కోసం బంగారు చీర తయారు చేయాలని నల్లా విజయ్‌కుమార్‌ని సంప్రదించారు. చీరను తయారు చేయాలని ఆరు నెలల క్రితమే ఆర్డర్ వచ్చిందని విజయ్‌కుమార్ తెలిపారు. బంగారాన్ని జరిపోవులు తీయడానికి, కొత్త డిజైన్ తయారు చేయడానికి పది నుంచి 12 రోజులు పట్టిందని ఆయన చెబుతున్నారు.
విజయ్‌కుమార్ నేపథ్యం : తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నల్లా విజయ్ కుమార్, బంగారు చీరలను మాత్రమే కాకుండా రంగులు మారే త్రీడీ చీరను సైతం రూపొందించారు. శ్రీరామనవమి(Sri Rama Navami 2024) సందర్భంగా భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఈ త్రీడీ చీర ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న దీని బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేశానని విజయ్ తెలిపారు. ఇందుకు రూ.48 వేలు ఖర్చు అయిందన్నారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్ నేసి ప్రశంసలు పొందారు.