Telangana

‘అయ్యప్ప మాలు ధరించిన రామ్ చరణ్ దర్గాకు ఎలా వెళ్తారు? ఏఆర్ రెహమాన్‌ను శబరిమలకు తీసుకురావలేరా?’

‘అయ్యప్ప మాలు ధరించిన రామ్ చరణ్ దర్గాకు ఎలా వెళ్తారు? ఏఆర్ రెహమాన్‌ను శబరిమలకు తీసుకురావలేరా?’

సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు హీరో రామ్ చరణ్ రెండు రోజుల క్రితం కడప పెద్ద దర్గాను సందర్శించారు. అయ్యప్ప మాల ధరించినప్పటికీ దర్గాను దర్శించడంతో ఇప్పుడు ఇది వివాదంగా మారింది. అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు ఎలా వెళ్ళారు అనేదిపై.. తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ప్రతినిధులు గుష్ఠిస్తున్నారు. రెహమాన్‌ను శబరిమలకు తీసుకురాగలరా..? అని ప్రశ్నిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు రోజుల క్రితం కడప పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గ కట్టే ఉత్సవాలలో భాగంగా ముషాయిరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దర్గాలో చాదర్ సమర్పించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మాట ప్రకారం, రామ్ చరణ్ దర్గాను సందర్శించినట్లు చెప్పారు. కానీ రామ్ చరణ్ అయ్యప్ప మాలో ఉండి దర్గాను సందర్శించటంతో వివాదం మొదలైంది. దీనిపై పలువురు హిందువులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువుల, అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీశారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక తీవ్రంగా ఆగ్రహించింది. దీక్షలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారని అయ్యప్ప జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాయని బుచ్చిరెడ్డి రామ్ చరణ్‌ను ప్రశ్నించారు. దర్గా లోపలికి వెళ్లేటప్పుడు రామ్ చరణ్ తన నుదిటిపై ఉన్న బొట్టును తుడిపించారు అని వారు చెప్పారు. మాల వేసుకున్న తర్వాత కొన్ని నియమాలు ఉంటాయని బుచ్చిరెడ్డి చెప్పారు. అశుభం జరిగే సమయములో మాత్రమే మాల, బొట్టు తీసేస్తారని గుర్తు చేశారు. మాల ధారణలో దర్గాకు వెళ్లడంపై రామ్‌చరణ్‌ వివరణ ఇవ్వాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం, రామ్ చరణ్ బాబాయ్ పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే, రామ్ చరణ్ మాత్రం అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లారని విమర్శించారు. ఈ ఘటన తమను తీవ్రంగా బాధించిందని చెప్పారు. కడప దర్గాకు వచ్చే వారు తక్కువ అయ్యారని, ఈ కారణంతో ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్‌ను దర్గాకు పిలిచారని వారు చెప్పారు.

అలాగే ఏఆర్ రెహమాన్‌ని కూడా శబరిమలకు నిష్టగా మాల ధరించి తీసుకురాగలరా? అని రామ్ చరణ్‌ను ప్రశ్నించారు. సనాతన ధర్మం, అయ్యప్పలను అవమానిస్తే సహించేది లేదన్నారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే, నిరసన కార్యక్రమాలు చేసేందుకు, రామ్ చరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్ వ్యవహారంపై నెట్టింట విమర్శలు రావడంతో, ఉపాసన కొణిదెల ఈ విషయంలో స్పందించారు. రామ్ చరణ్ అన్ని మతాలను ఆదరిస్తారనే విషయాన్ని చెప్పుతూ సోషల్ మీడియాలో ఒక సందేశం పెట్టారు. చరణ్ దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ, “సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్ హమారా” అనే గీతాన్ని జత చేశారు. “దేవుడిపై విశ్వాసం అందరినీ ఒక్కటిగా చేస్తుంది, కానీ అది ఎవరినీ విడగొట్టదు.” భారతీయులుగా మేము అన్ని మతాల విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తాం.”ఐక్యతలోనే మా బలం ఉంది. “రామ్‌చరణ్‌ తన మతాన్ని అనుసరిస్తూ, ఇతర మతాలను ఎప్పుడూ గౌరవిస్తారు” అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version