Telangana

మంత్రి కీలక ప్రకటన ఇందిరమ్మ ఇండ్లు, వారికే తొలి ప్రాధాన్యం

మంత్రి కీలక ప్రకటన ఇందిరమ్మ ఇండ్లు, వారికే తొలి ప్రాధాన్యం

అసెంబ్లీ కార్యాలయం లో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం త్వరలోనే ఈ పథకం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిచనున్నట్లు ఇండ్లులేని పేదలను తొలి ప్రాధాన్యంగా తీసుకొని  అందిచనున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఉన్నాయి. ఇండ్లు లేని నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఖాళీ స్థలం లేనివారికి జాగాతో పాటుగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఖాళీ జాగా ఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

పథకం అమలుపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు చెప్పారు. పూర్తిగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు మందుగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. అన్ని సంక్షేమ పథకాల అమలులో సమాన్యాయం గా ఉంటుంది అని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలకు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కార్యక్రమం దశల వారీగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వచ్చే విజయదశమి నాటికి మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.

తెలంగాణలో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అర్హులకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు అందిచనున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఇది వరకే ప్రకటించారు.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు నిర్మించనున్నారు. అపార్ట్‌మెంట్ల లాగా  కాకుండా.. లబ్ధిదారుల సొంత స్థలం లో 4 దశల్లో ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించగా.. తాజాగా వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లను తీసుకురానున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version