Business

Tata Mutual Fund: టాటాల సరికొత్త స్కీమ్.. పెద్దగా రిస్క్ లేకుండానే రిటర్న్స్

Tata AIA Life Insurance: ఇటీవలి కాలంలో పలు దిగ్గజ కంపెనీలు మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి కొత్త కొత్త పథకాల్ని లాంఛ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. రిస్క్ పెద్దగా లేకుండానే మంచి రిటర్న్స్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇందులో చేరేందుకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 30 గా ఉంది.

ఇప్పుడు టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ.. Nifty Alpha 50 ఇండెక్స్ ఫండ్ లాంఛ్ చేసింది. ఇది ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ అని చెప్పొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ప్రొటెక్షన్‌తో పాటుగా.. ఇది ఆల్ఫా ఇన్వెస్టింగ్ స్ట్రాటజీతో పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌తో ఇది లింక్ అయి పనిచేస్తుందని చెప్పొచ్చు. అంటే ఒకే దాంట్లో రెండు బెనిఫిట్స్ పొందొచ్చు.

ఈ NFO ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. ఇక ఆఖరి తేదీ సెప్టెంబర్ 30. ముఖ్యంగా ఈ ఫండ్ హై పెర్ఫామింగ్ స్టాక్స్‌లో (అత్యుత్తమ పనితీరు కనబరిచే స్టాక్స్) ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్‌లో లిస్టయి ఉన్నటువంటి టాప్ 50 పెర్ఫామింగ్ స్టాక్స్‌లో ఈ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్ వివరాల్ని చూస్తే.. మల్టీ క్యాప్ మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్.

వేర్వేరు మార్కెట్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న హై పెర్ఫామింగ్ స్టాక్స్‌‌లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు.. పాలసీ హోల్డర్లకు అదనపు ప్రయోజనాలు కల్పించాలన్నది దీని ఉద్దేశంగా ఉంది. ఈ ఫండ్ దాదాపు 80 నుంచి 100 శాతం వరకు ఈక్విటీ ఇంకా ఈక్విటీ రిలేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంది.

మరో 0 నుంచి 20 శాతం వరకు క్యాష్ అండ్ మనీ మార్కెట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో రిటర్న్స్, పాలసీ హోల్డర్ల రిస్క్ కెపాసిటీని సమతుల్యం చేస్తుందని చెప్పొచ్చు. రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్ల మేర వృద్ధి చెందుతుందని.. ఈ క్రమంలోనే భారత ఈక్విటీ మార్కె్ట్ సంపద సృష్టికి అవకాశాల్ని కల్పిస్తుందని అన్నారు టాటా ఏఐఏ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హర్షద్ పాటిల్. ఈ క్రమంలోనే పాలసీ హోల్డర్లకు మెరుగైన రిటర్న్స్ ఇచ్చే ఉద్దేశంతో ఈ స్కీం లాంఛ్ చేసినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version