Latest Updates

పౌరసత్వ చట్టంలోని ఆ నిబంధన చట్టబద్ధమే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అసోంలోకి వలస వచ్చిన హిందువులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించే పౌరసత్వ చట్టం 1955లోని కీలక నిబంధన సెక్షన్ 6A చెల్లుబాటును సుప్రీం కోర్టు సమర్థించింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 4-1 మెజార్టీతో గురువారం తీర్పు చెప్పింది.

ధర్మాసనంలోని మిగతా నలుగురు న్యాయమూర్తులకు భిన్నమైన అభిప్రాయాన్ని జస్టిస్ జేబీ పరిడివాలా వ్యక్తం చేయడం గమనార్హం. విదేశీయులను భారత పౌరులుగా గుర్తించినా.. పదేళ్ల వరకూ ఓటువేసే హక్కు ఉండదని వ్యాఖ్యానించారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఒకే విధమైన తీర్పు రాాశారు. రాజ్యాంగం ప్రకారం ఈ నిబంధన చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్) నుంచి శరణార్థుల రాక అసోం జనాభా సమతౌల్యతను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి, తీర్పు వెలువరించింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాష్ట్రంలోని అసలైన నివాసితుల రాజకీయ, సాంస్కృతిక హక్కులను ఉల్లంఘించిందని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే, బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చాలా మంది అక్రమ వలసదారులు రావడంతో అసోంలో సంస్కృతి, జనాభాకు పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సెక్షన్ 6A అమలు రాజకీయ పరిష్కారమని ముఖ్య న్యాయమూర్తి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపజేయవచ్చు, కానీ ఇది అసోంకి మాత్రమే ప్రత్యేకం కాబట్టి అలా చేయలేదు.. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారుల సంఖ్య, సంస్కృతి మొదలైన వాటి ప్రభావం అసోం ఎక్కువగా ఉంది. అక్కడ ఉన్న 40 లక్షల మంది వలసదారుల ప్రభావం పశ్చిమ బెంగాల్‌లో ఉన్న 57 లక్షల మంది కంటే ఎక్కువగా ఉంది, ఎందుకంటే అసోం విస్తీర్ణం పశ్చిమ బెంగాల్ కంటే తక్కువ’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే, తీర్పు 1971 మార్చి 25కు ముందు వచ్చిన వలసదారులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. స్థానికుల ప్రయోజనాలను కాపాడే సమతుల్యత ఈ సెక్షన్‌కు ఉంది అని చెప్పారు. ఈ సెక్షన్‌లో ఉన్న కటాఫ్ తేదీ 1971 మార్చి 25 అనేది సరైనది అని తెలిపారు. ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్ యుద్ధం ముగిసిపోయింది అని చెప్పారు.

jexe,1966 జనవరి నుండి 1971 మార్చి 25 వరకు అసోంలోకి వచ్చిన వలసదారులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఈ నిబంధన 1985లో అస్సాం అకార్డ్‌ తర్వాత అందుబాటులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version