Telangana
Less Recoveries in Cyber Crimes దోపిడీ కొండంత – రాబట్టేది గోరంత

దోపిడీ కొండంత – రాబట్టేది గోరంత – సైబర్ మోసాల సొమ్ము రికవరీలో పోలీసుల అలసత్వం – Less Recoveries in Cyber Crimes
Police Recovering Less Amount in Cybercrime : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లాభాల ఆశచూపుతూ సైబర్ మోసగాళ్లు భారీగా దండుకుంటున్నారు. సైబర్ నేరాల్లో కోల్పోయిన సొమ్ములో పోలీసులు అతి కష్టం మీద తక్కువ మొత్తంలో రికవరీ చేస్తున్నారు. దీనికి కారణం బాధితులు సకాలంలో ఫిర్యాదు చేయకపోవడమేనని వారు పేర్కొంటున్నారు.
Police Recovering Less Amount in Cybercrime : సైబర్ నేరగాళ్లు కొండంత సంపద కొల్లగొడుతుంటే, పోలీసులు మాత్రం అతి కష్టం మీద గోరంత నగదును రికవరీ చేయగలుగుతున్నారు. 90 శాతం మంది బాధితులకు న్యాయం దక్కడం లేదు. ఒక్క తెలంగాణ నుంచే ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో సైబర్ మోసగాళ్లు రూ.1300 కోట్లు కొల్లగొట్టారు. కానీ ఇందులో పోలీసులు ఇప్పటి వరకు రూ.114 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇది పోయిన సొమ్ములో 10 శాతం కూడా కాదు. ప్రజలు సైబర్ నేరాల పట్ల కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే వాటిని నియంత్రించడంతో పాటు బాధితులు పోగొట్టుకున్న సొమ్ములో చాలావరకు తిరిగి రాబట్టవచ్చని సైబర్ పోలీసులు చెబుతున్నారు.
డిజిటల్ అరెస్ట్ చేసి : ఉదాహరణకు ఒక ప్రముఖ బహుళజాతి సంస్థలో అకౌంట్స్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న వ్యక్తికి ముంబయి పోలీసుల పేరిట ఓ ఫోన్ కాల్ వచ్చింది. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని, వీడియో కాల్ ద్వారా సీబీఐ విచారణకు హాజరుకావాలని చెప్పారు. అలా వీడియో కాల్లో విచారణలో ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బెదిరించి ఆయన్ను డిజిటల్ అరెస్ట్ చేయడంచో ఆయన భయంతో అన్ని వివరాలు ఇచ్చారు. అకౌంట్లోని సొమ్మంతా పోయాక మోసపోయానన తెలిసిన తర్వాత ఏమీ చేయాలో బాధితునికి తెలియలేదు. ఆలస్యంగా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆయన ఖాతా నుంచి మాయమైన సొమ్మంతా దేశవ్యాప్తంగా వేర్వేరు ఖాతాల్లోకి జమకావడం వాటిని నేరగాళ్లు ఎక్కడికక్కడ డ్రా చేసుకోవడం అన్ని జరిగిపోయాయి.
ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో : ఇక్కడ విషయం ఏమిటంటే అంత ఉన్నత ఉద్యోగస్థుడైన ఆయనకు దర్యాప్తు సంస్థలేవీ వీడియో కాల్ ద్వారా విచారణ చేయవన్న అవహాహన లేకపోవడం. ఎవరైనా ఇలా డిజిటల్ అరెస్టుకు గురై డబ్బులు పోగొట్టుకున్నప్పుడు వెంటనే 1930కి కాల్ చేస్తే ఇతర ఖాతాల్లోకి బదిలీ కాకుండా వాటిని ఆపేస్తారని తెలియకపోవడం. బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం వల్ల నగదును రికవరీ చేయలేకుపోతున్నామని అందుకే ఇప్పటికీ 10శాతం కూడా మించలేదని పోలీసులు చెబుతున్నారు.