Telangana

హైదరాబాద్ లోని కంసన్ హైజెన్ కేర్ లో భారీగా అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ పరిశ్రమ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో ఉన్నటుండి మంటలు చేలరేగాయి. భారీ మంటలు ఎగిసిపడుతూ క్షణాల్లో పూర్తిగా మంటలు వ్యాపించాయి. దింతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంట వెంటనే సం ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఐదు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలిసింది.

ఇక వారం క్రితం హైదరాబాద్ యాకత్‌పూరా చంద్రానగర్ ప్రాంతంలోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో ముగ్గురు చనిపోయారు. అదే కాలనీకి చెందిన మోహన్ లాల్, ఉషారాణి అనే దంపతులు వాళ్ళ ఇంటి మొదటి అంతస్తులో భారీ ఎత్తున దీపావళి టపాసులు నిల్వ ఉంచారు. పండగ సందర్భంగా టపాసుల వ్యాపారం చేసేందుకు అక్రమంగా నిల్వ ఉంచారు. అయితే పండగ కోసం ఉషారాణి పిండి వంటలు చేస్తుండగా.. కడాయిలో ఉన్న నూనె బాగా వేడెక్కి మంటలు చెలరేగాయి. అనంతరం గదిలోని టపాసులకు అంటుకున్నాయి.

ఈ ప్రమాదంలో మంటలు వేగంగా వ్యాపించటంతో మోహన్ లాల్‌తో పాటుగా ఉషారాణి మంటల్లో కాలి బూడిదయ్యారు. వారి మనవరాలు శృతి గుప్తా (16) తీవ్రంగా గాయపడింది. ఆమెను గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. మూడ్రోజుల చికిత్స తర్వాత ఆమె కూడా మరణించింది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవటంతోనే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ఫైర్ సిబ్బంది వెల్లడిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version