Latest Updates

మూసివేసిన బంగారు గనిలోకి అక్రమంగా వెళ్లిన వేలాది చిన్నారులు..

మూసివేసిన బంగారు గనిలోకి అక్రమంగా వెళ్లిన వేలాది చిన్నారులు.. సాయం చేసేది లేదన్న ప్రభుత్వం

మూసివేసిన బంగారు గనిలోకి అక్రమంగా వెళ్లిన వేలాది మంది చిన్నారులు అక్కడే చిక్కుకుపోయారు. అయితే ప్రభుత్వం వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. గనిలో ఉన్న చిన్నారులను రక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పైగా, అక్కడ నుంచి బయటకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తోంది. చివరికి ఆ గనిని పూర్తిగా మూసివేసి.. అందులో ఉండిపోయిన చిన్నారులకు కనీసం నిత్యావసరాలను కూడా అందించడం లేదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

దక్షిణాఫ్రికాలోని వాయవ్య ప్రాంతంలో మూసివేసి ఉన్న బంగారు గనిలోకి దాదాపు 4000 మంది మైనర్లు అక్రమంగా ప్రవేశించినట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. మూసివేసిన ఆ గనిలో బంగారం దొరుకుతుందేమో అనుకుని లోపలికి వెళ్లిన చిన్నారులకు పెద్ద సమస్య ఎదురైంది. బంగారం దొరకకపోవడమే కాక, ప్రాణాలకు ప్రమాదం కలిగింది. ఇప్పుడు ఆ గనిలో ఉన్న వారిని రక్షించేందుకు అక్కడి ప్రభుత్వం సహకరించడం లేదు. వారు బయటకు రాకుండా గని ద్వారాలను కూడా మూసివేసింది. చిన్నారులకు అవసరమైన వస్తువులు అందించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక మీడియా వార్తలు పేర్కొన్నాయి.  గని నుంచి పిల్లలు బయటికి రాకుండా ఉండేందుకు ‘క్లోజ్‌ది హోల్‌’ అనే ఆపరేషన్‌ మొదలుపెట్టారు.  ఏదైనా కారణంగా పిల్లలు బయటికి వస్తే, వాళ్లను అరెస్ట్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే గని ప్రాంతంలో చాలా మంది సిబ్బందిని ఉంచారు. గనిలో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయం చేస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి సమాచారం అందిందని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. దాదాపు 4 వేల మంది చిన్నపిల్లలు గనిలో ఉన్నారని, కొన్ని రోజుల క్రితం వేరే గనుల దగ్గర వందల మంది చిన్నపిల్లలు కనిపించారని తెలిపారు. గనిలోకి వెళ్లిన వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు చెప్పారు. బయటికి వచ్చే వారిని అరెస్ట్ చేయడానికి ఎక్కువ మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. అక్రమంగా గనిలోకి వెళ్లిన చిన్నపిల్లలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదని చెప్పారు. నేరస్తులను కాపాడే ఉద్దేశ్యం లేనిదని, ఇలాంటి ఘటనలను ఆపేందుకు ఈ చర్యలు తప్పవని కేబినెట్ మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version