Latest Updates

అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎన్నికల్లో తెలుగు హవా..

అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అమెరికా ఎన్నికల్లో తెలుగు హవా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు బ్యానర్లు కనిపించడం విశేషం  ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఫ్లెక్సీలు రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఉన్నాయి . అందులో తెలుగు సహా 3 భారతీయ భాషలు ఉన్నాయి.

అమెరికాలో ప్రస్తుతం పెద్ద పెద్ద స్థానాల్లో భారత సంతతికి చెందిన రాజకీయ నేతలు ఉన్నారు. అమెరికాలో నివసించే అత్యధిక విదేశీయుల్లో భారతీయులు మొదటి స్థానంలో ఉంటారు. అమెరికా లో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలకు ఎంతో గౌరవం దక్కుతుంది. ఉద్యోగం కోసం వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు ఎంతో మంది ఉన్నారు.  ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ పోటీ చేస్తున్నరు ఆమె మూలాలు కూడా భారత్‌లోనే ఉండటం గమనార్హం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీలు ప్రవాస భారతీయ ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడడం తో పొట్టపోటీ జరుగుతుంది తాజాగా డల్లాస్‌లో తెలుగులో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీ కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలు తెలుగుతోపాటు తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఉండడం ఆచర్యం కలిగిస్తుంది.

అక్కడి ప్రవాస భారతీయులు షేర్ చేస్తూ.. మన దేశ గొప్పతనం అగ్రరాజ్యంలో చూడండి అంటూ కామెంట్లు చేస్తునారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓటు వేసే ఓటర్ల సమాచారాన్ని 14 భాషల్లో ముద్రించారు. వాటిలో తెలుగు ఒకటి కావడం తెలుగువారికి మరో గర్వకారణం.

ఇక డలాస్ లో ఉన్న ఆ ఫ్లెక్సీల్లో ‘సంస్కృతి, సన్మార్గం-దేశానికి ఆధారం’ అని రాసి ఉంది. రిపబ్లికన్‌కు ఓటు వేయాలని అని ఉండటం ఆచర్యం కలిగిస్తుంది. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ బలపర్చిన ఉపాధ్యక్షుడు వాన్స్‌. తెలుగు వారి సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. అమెరికా రాజకీయాల్లో కూడా తెలుగువారు, భారతీయులు కీలకంగా ఉన్నారు. తాజాగా అగ్రరాజ్య అధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ చేయడం భారత్‌కు గర్వకారణం. ఆమె ఇప్పటికే గత ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దీంతో అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఎవరు గెలిచినా భారత్‌కు గర్వకారణమేనని అక్కడి ప్రవాస భారతీయులు చెబుతున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version