Latest Updates

కెనడా మాదే అంటూ నినాదాలు..దేశం నుంచి కెనడియన్లనే వెళ్లిపొమ్మంటున్న ఖలిస్థానీలు..

కెనడా మాదే అంటూ నినాదాలు..దేశం నుంచి కెనడియన్లనే వెళ్లిపొమ్మంటున్న ఖలిస్థానీలు..

ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాలో రెచ్చిపోతున్నారు. కెనడాను వేదికగా చేసుకుని ఇతర దేశాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్న ఖలిస్థానీలు, ఇప్పుడు కెనడాకే సమస్యలు కలిగిస్తున్నారు. కెనడియన్లను కెనడాను వదిలి వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెనడాలోని శ్వేత జాతీయులు.. యూరప్ వెళ్లిపోండి అంటూ నినాదాలు చేస్తున్నారు. అసలైన కెనడియన్లం తామేనని తేల్చి చెబుతున్నారు. ఈ కారణంగా కెనడా సర్కార్‌కు మరో కొత్త సమస్య వచ్చింది. రోజురోజుకీ కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.

హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ నిత్యం ఏదో ఒక చోట నానా హంగామా సృష్టిస్తున్న ఖలిస్థానీలు.. తాజాగా తెల్లజాతివారిపై పడ్డారు. తాజాగా కెనడాలోని శ్వేత జాతీయులను దురాక్రమణదారులుగా అభివర్ణించారు. అసలైనా కెనడా తమదేనని.. తెల్లజాతివారే ఇతర దేశాల నుంచి కెనడాకు అక్రమంగా వచ్చి నివసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్వేతజాతీయులు అంతా యూరప్‌కు తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా ఓ ఖలిస్థానీ మద్దతుదారుడు విడుదల చేసిన ఓ వీడియోలో.. కెనడాకు యజమానులం తామేనని తేల్చి చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో కెనడియన్లను ఆ ఖలిస్థానీ మద్దతుదారుడు.. దురాక్రమణదారులుగా అభివర్ణించాడు. కెనడా యజమానులం మేంనే అంటూ 2 నిమిషాల వీడియోను విడుదల చేశారు. “ఇది మా దేశం. మేం కెనడా యజమానులం” అని చెప్పారు. మేం గొప్ప కెనడియన్లం. మీరు తిరిగి యూరప్‌ లేదా ఇంగ్లండ్‌కు వెళ్లిపోండి. “మీరు కెనడియన్లు కాదు. మేమే కెనడియన్లం. మీరు దురాక్రమణదారులు. శ్వేత జాతీయులారా, తిరిగి యూరప్‌కు వెళ్లిపోండి” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

కెనడాలోని భారత నిఘా వర్గాలు స్పందించాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల కెనడాలో సాధారణమయ్యాయనీ అన్నారు. తగిన నిఘా లేకపోవడంతో ఖలిస్థానీ మద్దతుదారులు అన్ని వ్యవస్థలను తమ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారని తెలిపారు. భద్రంగా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసే వారు, ఇప్పుడు వారినీ కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నారని చెప్పారు.  ఇటీవల కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు జరిగిన విషయం కనిపించిన తర్వాత, అక్కడ ఉన్న రెండు నగరాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బ్రాంప్టన్ నగరపాలక కౌన్సిల్, ఆలయాలు మరియు ప్రార్థనా స్థలాల్లో ఏ విధమైన నిరసనలు లేదా ఆందోళనలు నిర్వహించకూడదని చెప్పింది. అలా చేసిన వారికి భారీగా ఫైన్లు వేయనున్నట్లు తెలిపింది. ఇటీవల దాడులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రాంప్టన్‌తోపాటు మిస్ససాగు నగరంలో కూడా ఇదే రకమైన కొత్త చట్టం తీసుకువచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version