Latest Updates

కొత్త చీఫ్‌పై హమాస్ మారు మలుపు నిర్ణయం.. ఇది వ్యూహాత్మకమేనా? 

కొత్త చీఫ్పై హమాస్ మారు మలుపు నిర్ణయం.. ఇది వ్యూహాత్మకమేనా? 

ఏడాదికిపైగా ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. క్రమంలో హమాస్కు చెందిన చాలా ముఖ్యమైన నాయకులను ఇజ్రాయేల్ చంపింది. రెండు నెలల వ్యవధిలోనే, అక్కడి చీఫ్లలో ఇద్దరు చనిపోయారు. ఇటీవల గాజాలో జరిగిన దాడిలో యహ్వా సిన్వార్ చనిపోయారని తెలిసింది. భవనంపై ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో ముగ్గురు హమాస్ మిలిటెంట్టు హతమవ్వగా.. వారిలో ఒకర్ని సిన్వార్గా ధ్రువీకరించారు. దీనిని ఇజ్రాయేల్, అటు హమాస్ కూడా నిర్దారించాయి. 

 అక్టోబర్ 7 గాజాపై ఇజ్రాయేల్ దాడుల్లో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ చనిపోయాడు. దీంతో అతడి వారసుడిగా ఎవరు ఉంటారు? అనే చర్చ జరుగుతోంది. తరుణంలో కొత్త చీఫ్ నిమాయకంపై హమాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి పదవిలో ఎవర్నీ నియమించకుండా ఖాళీగా ఉంచాలని నిర్ణయించిందని, స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. జులైలో ఇస్మాయిల్ హనియా మృతి తర్వాత ఏర్పాటైన ఐదుగురు సభ్యుల కమిటీనే పొలిటికల్చీఫ్బాధ్యతలను సైతం నిర్వర్తించనున్నట్టు భోగట్టా. సిన్వర్వారసుడిగా ఒక వ్యక్తికి బాధ్యతలు కట్టబెట్టడం కంటే దోహా కేంద్రంగా కమిటీతో కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించినట్లు హమాస్వర్గాలు పేర్కొన్నాయి. 

కానీ, వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికల వరకు కొత్త అధ్యక్షుడిని నియమించకూడదని వారు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అప్పటి వరకు హమాస్కు కమిటీయే నాయకత్వం వహించనున్నట్లు సమాచారం. గాజాకే పరిమితమైన సిన్వర్తో కమ్యూనికేనషన్లలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ‘పరిస్థితులు అనుకూలించి మార్చిలో ఎన్నికలు జరిగితే అప్పటి వరకూ మరణించిన యహ్వా సిన్వార్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించకూడదని హమాస్ అధినాయకత్వం నిర్ణయించిందిఅని తెలిపాయి. 

 ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన బాంబు దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా చనిపోతే, ఐదుగురు సభ్యుల కమిటీ ఆగస్టులో ఏర్పడింది.కమిటీ సభ్యుల్లో ఖలీల్ అల్‌- హయ్యి గాజాకు, వెస్ట్ బ్యాంక్కు జహెర్ జబరిన్, విదేశాల్లో హమాస్ కార్యకలాపాలకు ఖాలెద్ మషాల్నాయకత్వం వహిస్తున్నారు. మరొక వైపు, హమాస్ షూరా అడ్వైజరీ కౌన్సిల్ చీఫ్గా మహ్మద్ దర్వీష్ ఉన్నారు. రాజకీయ బ్యూరో చీఫ్గా మరో వ్యక్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పేరును మాత్రం బయటపెట్టలేదు. ప్రస్తుతం కమిటీలోని సభ్యులందరూ ఖతార్లో ఉన్నారు. 

 విశ్వసనీయ వర్గాల ప్రకారం.. యుద్ధం, అసాధారణ పరిస్థితుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలు కమిటీనే నిర్వహిస్తోంది. వ్యూహాత్మక నిర్ణయాలను కమిటీనే తీసుకుంటుందని తెలిపాయి. 

 కాగా, హమాస్కు అంతర్గతంగా అధినేతను నియమించి.. పేరును మాత్రం బహిర్గతం చేయకూడదనే మరో ఆలోచనలో సైతం సంస్థ ఉన్నట్లు మరో విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చీఫ్ పేరు చెప్పకపోవడం ఒక వ్యూహమని, దీని వల్ల శత్రువులు టార్గెట్ చేయలేరని అనుకుంటున్నారు. కానీ, కమిటీ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలనే ఆలోచనలో సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version