Latest Updates

‘ఉల్లి’ లొల్లి.. కేఎఫ్‌సీ సహా బర్గర్ కింగ్ వరకు అన్ని రెస్టారెంట్లలో సరఫరా నిలిపివేత

‘ఉల్లి’ లొల్లి.. కేఎఫ్‌సీ సహా బర్గర్ కింగ్ వరకు అన్ని రెస్టారెంట్లలో సరఫరా నిలిపివేత

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ.కొలి బ్యాక్టీరియా వ్యాప్తి జనవరి నుంచి ఆందోళనకు గురిచేస్తోంది. రెస్టారెంట్లలో ఇచ్చే పచ్చి ఉల్లిపాయ ముక్కల్లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. . ఈ బాక్టీరియా ప్రభావంతో తీవ్రమైన జ్వరం, విరోచనాలు, వాంతులు, వాటితో తరచుగా అనారోగ్యానికి గురవుతారు.  దీంతో పలు రెస్టారెంట్లు తమకు సరఫరా అవుతోన్న ఉల్లిని పక్కనబెట్టాలని నిర్ణయించారుసాధారణంగా ఇది నీటి పైపులు, ట్యాంకులు, కంటైనర్లలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది.

మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్‌‌లో ఒకరు ఫుడ్ ఫాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. పది మందికిపైగా అస్వస్థతకు గురయిన ఘటన అమెరికాలోని కొలరాడోలో జరిగిన విషయం తెలిసిందే. వారు తిన్న ఆహార పదార్థాల్లోని ఈ.కొలి బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం బారినపడినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేఎఫ్‌సీ సంస్థ బర్గర్ కింగ్‌, యమ్ బ్రాండ్స్ లు , ఉల్లిపాయల వాడకంపై ఈ నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని తమ సంస్థకు చెందిన టాకో బెల్, పిజా హట్, కేఎఫ్‌సీ ఔట్‌లెట్స్‌లో ఉల్లిపాయలు వినియోగించరాదని యమ్ సంస్థ గురువారం ప్రకటించినట్టు బ్లూంబర్గ్ న్యూస్ నివేదించింది. కానీ  ఏ ఔట్‌లెట్స్, ఏ ప్రాంతం,  అనే వివరాలను వెల్లడించలేదు.

‘మేము అందజేసే ఆహార ఉత్పత్తుల్లో భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి నియంత్రణ మార్గదర్శకాలను అనుసరిస్తాం’ అని ఆ సంస్థ పేర్కొంది. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌లకు టేలర్ ఫార్మ్స్ సరఫరా చేసిన ఉల్లిపాయలల్లో ఈ.కొలి వ్యాప్తి చెందినట్టు బర్గర్ కింగ్ గురువారం వెల్లడించింది. టేలర్ ఫార్మ్స్ సరఫరా చేసిన ఉల్లి ఉత్పత్తులో  బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించనప్పటికీ మార్కెట్ నుంచి వెనక్కి రప్పించింది. అమెరికా ఫుడ్ హోల్డింగ్ కార్పొరేషన్, సైస్కో కార్పొరే‌షన్‌లు కూడా ఇదే విధంగా ఉల్లిపాయలను రీకాల్ చేశాయి.

‘అధికారులు ఎటువంటి ఆదేశాలు, అనారోగ్య సూచనలు చేయనపపటికీ రెండు రోజుల కిందట సరఫరా అయిన ఉల్లిపాయలను వాడొద్దని 5 శఆతం రెస్టారెంట్‌లకు కోరాం’ బర్గర్ కింగ్ పేర్కొంది. టేలర్ ఫార్మ్స్ నుంచి వచ్చిన ఉల్లిపాయలను జానీ రాకెట్స్ రెస్టారెంట్స్ సహా ఫ్యాట్ బ్రాడ్స్ ఇంక్ వాటిని వాడొద్దని సూచించింది. కొలరాడో జరిగిన ఘటనతో అమెరికాలోని రెస్టారెంట్లు పచ్చి ఉల్లిపాయ ముక్కలను కస్టమర్లకు అందజేయరాదని నిర్ణయానికి వచ్చాయి. మెక్‌డొనాల్డ్స్ అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ రెస్టారెంట్లలోని 20 శాతం వాటిలో ఉల్లిపాయల వినియోగం నిషేధించింది. మనిషి ప్రాణం తీసే బ్యాక్టీరియా ఉందనే భయంతో ఈ ఏడాది జనవరిలో అమెరికాలో మాంసం విక్రయాలు జరిపే ఓ సంస్థ వేలాది కిలోల మాంసాన్ని మార్కెట్ నుంచి వెనక్కి రప్పించింది.

‘ఎచేరిచియా కొలి (Escherichia.coil)’ ఈ.కొలి ఇది మనుషులు, జంతువుల ఉదరంలో పేగుల్లో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version