Latest Updates

గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించిన ఘటన

గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించిన ఘటన

ఒక గిరిజన మహిళ తన పొలం మీదుగా ట్రాక్టర్ నడిపి పంటను నాశనం చేయడాన్ని ఆపేందుకు ప్రయత్నించింది. అయితే, అక్కడ ఉన్నవారు ఆమెపై దాడి చేశారు. ఆమెను కొట్టారు, హింసించారు, ఇంకా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒడిశాలో ఒక దారుణ ఘటన జరిగింది. అక్కడ ఒక గిరిజన మహిళకు బలవంతంగా మానవ మలం తినిపించారు. ఈ ఘటన గత వారం జరిగినా, ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిపై ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ నాయకులు అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఒడిశాలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళపై దాడి చేసి, ఆమెకు బలవంతంగా మానవ మలం తినిపించారు. ఈ ఘటన నవంబర్ 16న బొలన్‌గిర్ జిల్లా బంగముండా పోలీస్ స్టేషన్ పరిధిలోని జురాబంధ్ గ్రామంలో జరిగిందని పోలీసులు తెలిపారు. బాధిత గిరిజన మహిళ తన భూమి మీదుగా నిందితుడు ట్రాక్టర్ నడిపి పంట నాశనం చేయడాన్ని ఆపేందుకు అతడిని నిలదీసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో నిందితులు ఆమెపై దాడి చేసి, ఆమె నోటిలో బలవంతంగా మానవ మలం పెట్టారు. ఆమెను కాపాడేందుకు ఓ బంధువు ప్రయత్నించగా, అతనిపైనా నిందితులు దాడి చేశారు.

ఈ దాడికి గిరిజనేతరులు కారణమని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గిరిజన మహిళపై దాడి జరగడం ఒడిశాలో రాజకీయ వివాదం తెచ్చుకుంది. బీజేడీ ఎంపీ నిరంజన్ బిసి మీడియాతో మాట్లాడుతూ, నిందితుడిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గిరిజనులు చాలా ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. బంగముండాలో శాంతి భద్రతలకు సమస్యలు వస్తే, దానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బొలన్‌గిరి ఎస్పీ కిలారి రిషికేశ్ ద్యాన్‌దియో మీడియాతో మాట్లాడుతూ, గిరిజన మహిళపై దాడి చేసిన నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారని వివరించారు.

అతడిని పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశామని, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా పోలీసులు గాలిస్తున్నారని ఎస్పీ తెలిపారు. నిందితుడు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేడని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల లోపలి ప్రాంతాల్లో అమాయక గిరిజనులపై దారుణాలు జరుగుతున్నాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version