Latest Updates

‘గాంధీ శాంతి నడక – 2024’ డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జరిగినది

‘గాంధీ శాంతి నడక – 2024’ డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జరిగినది

అగ్రరాజ్యం లోని ఇర్వింగ్ నగరంలో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఐఏఎన్‌టీ ఆధ్వర్యంలో ‘గాంధీ శాంతి నడక – 2024’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికాలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని టెక్సాస్‌లోనే ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

టెక్సాస్‌లోని ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఐఏఎన్టీ ఆధ్వర్యంలో‘గాంధీ శాంతి నడక – 2024’ పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐఏఎన్టీ అధ్యక్షులు రాజీవ్ కామత్, మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎం.జి.ఎం.ఎన్.టి) కార్యదర్శి రావు కల్వాల అతిథులకు స్వాగతం పలికారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మహాత్మాగాంధీ స్మారక స్థలి నిర్మాణంలో సహకరించిన తోటి కార్యవర్గ సభ్యులకు, ప్రజలకు, సంస్థలకు, దాతలకు, ఇర్వింగ్ నగర అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు.

ముఖ్య అతిథిగా ఇర్విన్ నగర మేయర్

ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ మాట్లాడుతూ కేవలం మహత్మాగాంధీ విగ్రహ నిర్మాణమేగాక, ఈ 18 ఎకరాల సువిశాలమైన పార్క్ సుందరీకరణలో కూడా భాగమైన ఎం.జి.ఎం. ఎన్.టి నాయకత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు’ అని అన్నారు.

విజయవాడకు చెందిన శిల్పికి సన్మనాం

ఈ వేడుకలలో ప్రత్యేక అతిథులుగా గాంధీ విగ్రహాన్ని మలిచిన విజయవాడకు చెందిన శిల్పి బుర్రా శివ వరప్రసాద్, గుజరాత్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోనితో పాటు కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికైన భారత సంతతికి చెందిన బిజు మాథ్యూ, రమేశ్ ప్రేమ్ కుమార్‌లు, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులు రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడులను డా. ప్రసాద్ తోటకూర, ముఖ్య అతిథులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలసి ఘనంగా సన్మానించారు.

గాంధీ స్మారకస్థలిని సందర్శించిన ఈనాడు ఏపీ ఎడిటర్

ఈనాడు దినపత్రిక (ఆంధ్రప్రదేశ్, న్యూ ఢిల్లీ, కర్ణాటక) ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. అలాగే, ఈ విగ్రహ నిర్మాణ సాకారంలో అవిరళ కృషిచేసిన వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, కార్యవర్గ సభ్యులందరినీ అభినందించారు. ఇది ప్రవాస భారతీయులు ఐకమత్యానికి చిహ్నమని కొనియాడారు. ప్రవాస భారతీయుడుగా ఉన్న గాంధీ దక్షిణాఫ్రికా నుంచి మాతృదేశానికి తిరిగివచ్చి భారత స్వాతంత్ర్య సముపార్జనలో దశాబ్దాలుగా సాగించిన శాంతియుత పోరాటం చరిత్ర మరువలేని సత్యం అన్నారు.

ఇర్విన్ మేయర్‌తో కలిసి శిలాఫలకం ఆవిష్కరణ

దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసి దాతలపేర్లతో కూడిన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డి. సి మంజునాథ్ ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version