Latest Updates

ఢిల్లీలో దారుణమైన పరిస్థితి.. దీపావళి ఎఫెక్ట్.. ఆ గాలి పీల్చితే ఇంకేమైనా ఉందా?

దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య  గా మారిపోయిందిప్రపంచంలో అత్యంత కాలుష్యకారక నగరాల్లో ఒకటిగా పేరు పొందిన ఢిల్లీలో శీతాకాలం వస్తే నరకం లాంటిదే. ఉదయం 12 గంటల తర్వాత కూడా పొగ మంచు తగ్గదు. బయటకు వెళ్లాలంటే జనం భయపడే పరిస్థితి నెలకుంటుంది. దీపావళి సందర్భంగా టపాసులు పేల్చవద్దని ఎంతగా మొత్తుకుంటున్నా జనం మాత్రం పట్టించుకోలేదు. విచ్చలవిడిగా బాణాసంచా కాల్పులతో కాలుష్యం తీవ్రమైంది. దీంతో వాయు నాణ్యత సూచీ పడిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. దీపావళి వేడుకల్లో కాల్చిన బాణాసంచాతో గాలిలో నాణ్యత మరింత దిగజారింది. శుక్రవారం ఉదయం అన్ని ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిని మించిపోయింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నగరవాసులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చడమే దీనికి కారణం. ఢిల్లీ నగరం మొత్తాన్ని గాలి కాలుష్యం దుప్పటిలా కప్పేసింది. గాలి అత్యంత విషతుల్యంగా మారిపోగా.. దీనిని పీల్చితే అనారోగ్యం బారినపడటం ఖాయం. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 360 దాటేసింది.

సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోరకాస్టింగ్ అండ్ రిసెర్చ్ (సఫర్) డేటా ప్రకారం, శుక్రవారం ఉదయం 6.30కి వాయు నాణ్యత సూచీ సగటు 359గా నమోదైంది. ఇది చాలా ప్రమాదకరం. నగరంలోని అన్ని కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆనంద్ విహార్, ఆర్కే పురంలో అత్యధికంగా 395గా ఉంది. తర్వాత పంజాబీ బాగ్ (391), బురారీ క్రాసింగ్ (394), నార్త్ క్యాంపస్ (390), సోనియా విహార్ (392), బవానా (388), జహంగీర్‌పూర్ (387), నెహ్రూ నగర్ (381), రోహిణి (385), అశోక్ విహార్ (384), లో కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయికి దాటేసింది. శుక్రవారం ఈ స్థాయిలోనే ఉంటుందని పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియాలజీ ముందే అంచనా వేసింది.
కాగా, దీపావళి సందర్భంగా బాణాసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో నగరవ్యాప్తంగా పర్యవేక్షణకు 377 టీమ్‌లను నియమించినట్టు ఢిల్లీ వాతావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అన్ని కమిషనరేట్ల పరిధిలోనూ టపాసులను కాల్చకుండా అడ్డుకోవాలని డీసీపీలకు ఆదేశాలు ఇచ్చినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. గతేడాది దీపావళి మర్నాడు ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. నవంబరు 12న దీపావళి జరుపుకోగా.. ఆ మర్నాడు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 218గా నమోదయ్యింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం అదే మొదటిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version