Latest Updates

దేశంలో అతి తక్కువ కాలుష్యంతో ఉన్న నగరాలు ఇవే.. ఇక్కడ తాజా గాలి!

దేశంలో అతి తక్కువ కాలుష్యంతో ఉన్న నగరాలు ఇవే.. ఇక్కడ తాజా గాలి!

దేశంలో స్వచ్ఛమైన గాలి కలిగి ఉన్న నగరాల జాబితా విడుదలైంది. ఈ నగరాల్లో గాలి నాణ్యత చాలా మంచి స్థాయిలో ఉందని తెలియజేశారు. దేశంలో 7 రాష్ట్రాల్లో గాలి నాణ్యత బాగుందని.. మరి 2 నగరాల్లో కూడా గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో తీవ్రమైన వాయు కాలుష్యం జరుగుతున్న సమయంలో, ఇలాంటి స్వచ్ఛమైన గాలి ఉన్న నగరాల జాబితా వెలువడటం విశేషం.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత సూచీ చాలా తగ్గిపోతోంది. రోజు రోజుకు పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నప్పుడు, ప్రభుత్వాలు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలో తక్కువ కాలుష్యం ఉన్న నగరాల జాబితాను విడుదల చేసింది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం ఎక్కువగా ఉండటం జరుగుతున్నప్పటికీ, కొన్ని నగరాలు మాత్రం స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నాయి.

దేశంలోని 9 నగరాల్లో గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది. వాటిలో 7 నగరాల్లో గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉందని, మరి 2 నగరాల్లో సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన ప్రకారం, దేశంలో అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ మొదటి స్థానంలో ఉంది. ఐజ్వాల్‌లో గాలి నాణ్యత సూచీ 26గా ఉంది. ఇందువల్ల ఐజ్వాల్ వాసులు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నారని చెప్పింది.

ఐజ్వాల్‌ తర్వాత సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో ఏక్యూఐ 35.. మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లో ఏక్యూఐ 36 గా నమోదవడంతో, అటు తెలిపింది. అస్సాంలోని గువాహటిలో 40 ఏక్యూఐ.. కర్ణాటకలోని చామరాజనగర్‌ 41 ఏక్యూఐ, కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో 42 ఏక్యూఐ, కేరళలోని త్రిస్సూర్‌లో 43 ఏక్యూఐ నమోదైనట్లు తెలిపింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 50 కంటే తక్కువ అయితే, అది మంచి గాలి అని భావిస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నహర్లగన్‌లో 51 ఏక్యూఐ, అస్సాం నాగాన్‌ నగరంలో 53 ఏక్యూఐ తో సంతృప్తికరంగా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఏక్యూఐ 50 నుంచి 100 మధ్య ఉంటే, అది సంతృప్తికరంగా ఉందని అంటారు.

ఇక మరోవైపు.. దేశంలోని పలు నగరాల్లో ఏక్యూఐ భారీగా సూచిస్తుంది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యంతో ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ఢిల్లీ ఉండటం చాలా ఆందోళన కలిగించే విషయం. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 500 దాటడం పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుంది. బుధవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 422గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 500 దాటింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version