Politics

KK Survey: హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై కేకే సంచలన సర్వే.. ఆ పార్టీదే గెలుపు!

KK Survey: హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై కేకే సంచలన సర్వే.. ఆ పార్టీదే గెలుపు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయాన్ని కచ్చితంగా అంచనా వేసింది కేకే సంస్థ. ఈ సర్వేఎగ్జిట్ పోల్ అంచనాలు వాస్తవ ఫలితాలతో సరిగ్గా సరిపోలడంతో ఒక్కసారిగా దాని పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ అసెంబ్లీ ఎన్నికలు జరుపుకుంటున్న హరియాణాతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ సర్వేలు చేస్తోంది. హరియాణాలో బీజేపీ పట్ల వ్యతిరేకత.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం వరంలా మారిందని, ఈ సర్వేలో తేలింది.

హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందా? పదేళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సత్తా చాటుందా? అనేది మరో మూడు వారాల్లో తేలిపోనుంది. అక్టోబరు 5న హరియాణాలోని మొత్తం 90 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకుంది. హరియాణా ఎన్నికలపై పలు సంస్థల సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100 శాతం కచ్చితమైన సర్వేతో సంచలనం రేపిన కేకే.. హరియాణాలో సర్వే నిర్వహించారు. హరియాణా ప్రీపోల్ సర్వేపై కేకే సంస్థ అధినేత కొండేటి కిరణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో ఎన్నికలు జరగనున్న హరియాాణాలో బీజేపీ ఓటమి ఖాయమని తమ సర్వేలో వెల్లడయ్యిందన్నారు

హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయవకాశాలు 100 శాతం ఉన్నాయని చెప్పారు. పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో రెండు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని సర్వేలో తేలిందని చెప్పారు. ఈ పరిస్థితి కేవలం ఒక్క హరియాణాకు మాత్రమే పరిమితం కాదని, త్వరలో జరగబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. బిహార్, పశ్చిమ్ బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మింగుడుపడని ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో టైటానిక్‌లా దేశంలో బీజేపీ మునిగిపోతున్న నావలా మారిందన్నారు. హరియాణాలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ ఓటమే కాంగ్రెస్‌కి సానుకూల అంశం తప్ప, ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత ఏమిలేదని పేర్కొన్నారు. బీజేపీ కోర్ ఓటు అలాగే ఉందని, తటస్థులను మాత్రం నష్టపోనుందని సర్వేలో తేలిందని వివరించారు. ఎక్కువ పార్టీలు బరిలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ లబ్ది పొందుతుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్‌కు మళ్లుతుందని అంచనా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version