Entertainment
పవన్ కళ్యాణ్‌ను అలా చూస్తే చాలా బాధ కలిగింది : అంజనా దేవి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా మారి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది , భీమ్లా నాయక్ సినిమాలతో మెప్పించారు పవన్. ఇక సినిమాల్లో రాణించిన పవన్. జనసేన రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మ అంజనా దేవి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో అంజనాదేవి పవన్ కళ్యాణ్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అని యాంకర్ అనగానే అంజనాదేవి గారికి ఆనందం పొంగిపోయింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ చిన్ననాటి విషయాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అంజనా దేవి.
పవన్ ఎన్నికల ముందు ఒక ఆందోళనలో పాల్గొని రోడ్డుమీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందని అంజనా దేవి అన్నారు. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ.. ఇది చేయాలి అంటే చేసేసేవాడు అని అన్నారు. త్వరలోనే ఈ పూర్తి ఇంటర్వ్యూ రానుంది. అమ్మ మనసు అనే ఈ ఇంటర్వ్యూ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.