Telangana

‘ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాను’ అంటూ యువతిని వేధించిన ఘటన..

ప్రేమ పేరుతో ఒక యువకుడు తన స్నేహితురాలిని తీవ్రంగా వేధించి, ఆమెను మానసికంగా, శారీరకంగా అడ్డుకొన్న సంఘటన హయత్‌నగర్‌లో చోటు చేసుకుంది. యువతి తనను ప్రేమించాలని, లేదంటే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల వివరాల ప్రకారం, నాగార్జున సాగర్ ప్రాంతానికి చెందిన చెరుకుపల్లి విజయ్, హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చదివే యువతితో స్నేహితులు. కాలేజీ రోజుల నుండి విజయ్ యువతిని ప్రేమ పేరుతో వేధించటం మొదలు పెట్టాడు. తాము సరదాగా దిగిన ఫోటోలు, వీడియోలను మార్ఫ్ చేసి ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడు. విజయ్ ఆమెను బస్ స్టాండ్, కాలేజీ దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడని, మరొకసారి కాలేజీ నుంచి వస్తున్నప్పుడు తన బైక్ ఎక్కమని ఒత్తిడి చేసినట్లు బాధితురాలు తెలిపింది.

“ప్రేమించకపోతే, ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాను, నీ అమ్మ నాన్నను కూడా చంపేస్తా” అని ఆమెను బెదిరించినట్లు యువతి పోలీసులకు తెలిపింది. గతంలో కూడా విజయ్ తన ఇంటికి వచ్చి ఆమె తండ్రిపై దాడి చేశాడని, ఇంకా ఇతర అమ్మాయిలను కూడా ఇలాగే వేధించినట్లు ఆమె పేర్కొంది.

వీటిని తట్టుకోలేకపోయిన బాధితురాలు హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇటీవల, హైదరాబాద్‌లోనే ప్రేమ పేరుతో ఒక యువకుడు, తన ప్రేమించుకున్న అమ్మాయిని విదేశాలకు పంపించిన కోపంతో, ఆమె తండ్రిపై ఎయిర్ గన్‌తో కాల్పులకు పాల్పడిన ఘటన మరువకముందే, ఈ కొత్త ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఈ తరహా ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version