Entertainment

‘మ్యాడ్’ బాయ్స్ మళ్లీ రాబోతున్నారు.. అదిరిపోయే పట్టు బట్టల్లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గతేడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గతేడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కొన్ని నెలల క్రితం బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్‌’ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, వైభవంగా ప్రారంభ వేడుకను నిర్వహించింది. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు ఒక తీపికబురు చెప్పారు. ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్ సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

First Look Poster: MAD Square (Narne Nithiin)

ఈ తీపి కబురుని తెలపడమే కాకుండా, సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్ లో వారి వేషధారణ, శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది. మ్యాడ్ గ్యాంగ్ ను సరికొత్తగా పరిచయం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ‘మ్యాడ్ స్క్వేర్‌’ పోస్టర్ ను చూడగానే ‘మ్యాడ్’ అభిమానులు ప్రేమలో పడిపోతారు అనడంలో సందేహం లేదు. మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్‌బస్టర్ పాటలు ఉంటాయని నిర్మాతలు వాగ్దానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version