Entertainment

చిరంజీవి నిజంగా దుర్మార్గుడు!.. జేడీ చక్రవర్తి వీడియో వైరల్

జేడీ చక్రవర్తి ఓ మెగా అభిమాని అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి అంటే జేడీ చక్రవర్తికి పిచ్చి. హార్డ్ కోర్ ఫ్యాన్. ఆర్జీవీ గ్యాంగ్‌లో జేడీ చక్రవర్తి ఉన్నా కూడా.. ఇతని ధోరణి వేరేలా ఉంటుంది. ప్రేమను, అభిమానాన్ని వ్యక్త పరిచే విధానం ఆర్జీవీలానే ఉంటుంది. తాజాగా జేడీ చక్రవర్తి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అలీతో సరదాగా షోలో జేడీ చక్రవర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి ఎంత కష్టపడతాడు అని చెప్పడానికి ఓ ఉదాహరణ చెప్పాడు.

చిరంజీవి ఎంత కష్టపడతాడు అని చెప్పడానికి ఎంతో మంది ఎన్నో సార్లు తమ తమ అనుభవాల్ని పంచుకున్నారు. తాజాగా జేడీ చక్రవర్తి చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఘరానా మొగుడు సినిమా షూటింగ్ టైంలో ఈ ఘటన జరిగింది. వారంకి పైగా రోజూ షూటింగ్ జరుగుతోందట. అందరూ వస్తున్నారు.. పోతోన్నారు కానీ.. చిరంజీవి మాత్రం అలానే షాట్ అయ్యాక.. పక్కనే ఉన్న అంబాసిడర్ కార్లో పడుకుంటున్నాడట.

అప్పట్లో కేరవ్యాన్లు ఉండేవి కావు కాబట్టి.. మేకప్ రూంలోనే పడుకుంటారట.. ఇలా కార్లో ఎందుకు పడుకుంటున్నాడని ఓ అభిమానిగా ఉండబట్టలేక అడిగాను.. మీరు ఎందుకు ఇక్కడ పడుకుంటున్నారు.. అని అంటే.. నేను ఒక వేళ మేకప్ రూంలో రెస్ట్ తీసుకుంటే.. నన్ను చిత్రయూనిట్ పిలవదు.. అందుకే ఇక్కడ పడుకున్నాను.. ఇక్కడ ఉంటే డైరెక్టర్ షాట్ రెడీ అంటే నాకు వినిపిస్తుంది.. నేను వెంటనే వెళ్లొచ్చు అని అన్నాడు.

అంత పని రాక్షసుడు.. దుర్మార్గుడు అంటూ చిరు పడే కష్టం గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు జేడీ చక్రవర్తి. ఇక జ్వాల సినిమా టైంలోనూ రాళ్లు పగిలే ఎండలోనూ చాలా కష్టపడ్డాడని, చర్మం కూడా కమిలిపోయేదంటూ డైరెక్టర్ చెప్పిన మాటలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. ఇక జేడీ చక్రవర్తి మాట్లాడిన మాటల్ని మెగా ఫ్యాన్స్ బాగానే వైరల్ చేస్తున్నారు. ఇప్పటికీ జేడీ చక్రవర్తి మెగాస్టార్ చిరు గురించి చెబుతూ ఉంటే ఓ నార్మల్ ఫ్యాన్‌లా మారిపోతుంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version