Entertainment

Bigg Boss 8 Telugu Day 26: అరాచకంగా ఆడిన పృథ్వీ.. గుండు పగలగొడతా అంటూ విష్ణుప్రియ..

బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపేందుకు శక్తి, కాంతార టీమ్‌లకి ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ అంటూ టాస్కులు పెడుతున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన రెండు టాస్కుల్లో ఒక దాంట్లో సీత టీమ్ గెలవగా మరో టాస్కులో రెండు టీమ్‌లు ఓడిపోయాయి. ఇక ఈరోజు గేమ్‌లో రెండూ టీమ్‌లకి ఓ టఫ్ టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. మరి ఇందులో ఎవరు గెలిచారు.. ఏమైందో చూద్దాం.

పృథ్వీ.. ఆటతో పాటు పాట
“సర్వైవల్‌ ఆఫ్‌ ది ఫిట్టెస్ట్ టాస్కుల్లో భాగంగా ఇస్తున్న మూడో టాస్కు.. ‘పట్టుకునే ఉండు.. లేదా పగిలిపోతుంది’.. ఈ గేమ్‌లో భాగంగా 15 నిమిషాల పాటు ఫ్రేమ్ మీద హ్యాండిల్‌కి కట్టి ఉన్న బెలూన్‌ను పగలగుండా చూసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చివరి వరకూ బెలూన్ పగలగుండా ఉన్న సభ్యుడు విజేత. గెలిచిన టీమ్‌ ప్రైజ్ మనీలో లక్ష రూపాయలు యాడ్ చేయడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు పొందుతుంది” అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్కు కోసం నిఖిల్ టీమ్ నుంచి పృథ్వీ.. సీత క్లాన్ నుంచి నబీల్ పోటీపడ్డారు. మణికంఠ సంచాలక్‌గా వ్యవహరించాడు.

అయితే ఈ టాస్కు జరుగుతున్నప్పుడు మిగిలిన సభ్యులన బయటికి పంపించాడు బిగ్‌బాస్. దీంతో బోర్ కొడుతుందంటూ నబీల్ అనడంతో మణికంఠ ఓ పాట పాడాడు. నిజానికి మణి బాగానే పాడిన బయట ఉన్న యష్మీ కావాలని సెటైర్లు వేసింది. మణికంఠ పాట పాడితే డీమోటివేట్ అవుతారు అంటూ యష్మీ అంది. ఇక ఆ తర్వాత పృథ్వీ కూడా “ఎవరెవరో” అంటూ యానిమల్ సినిమాలో రొమాంటిక్ సాంగ్ పాడాడు. దీనికి ఈ పాట హౌస్‌లో ఎవరికోసమో అంటూ నబీల్ అడగడంతో “విష్ణుకోసం” అంటూ పృథ్వీ అన్నాడు. ఈ మాట విన్న వెంటనే విష్ణుప్రియ ఫేస్ మొత్తం తెగ బ్లష్ అయిపోయింది.

గుండు పగలగొడతా అంటూ విష్ణు
నబీల్-పృథ్వీ ఇద్దరూ టాస్కు చాలా బ్రహ్మాండంగా ఆడారు. ముఖ్యంగా పోటాపోటీగా గంటల పాటు ఆ రాడ్‌ను అలానే పట్టుకొని ఉన్నారు. దీంతో వీరికి బోర్ కొట్టకుండా ఉండేందుకు బిగ్‌బాస్ మధ్యలో సరదాగా కొన్ని చిలిపి ప్రశ్నలు వేశాడు. నబీల్ నీకు ఇష్టమైన సభ్యులు ఎవరు ఈ హౌస్‌లో అంటూ బిగ్‌బాస్ అడిగితే సీత అంటూ టక్కున ఆన్సర్ ఇచ్చాడు నబీల్. “పృథ్వీ.. నబీల్‌ను నా తరఫున ఏదైనా అడగాలంటే అడిగేయండి..” అంటూ బిగ్‌బాస్ అనడంతో “నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పరా” అంటూ పృథ్వీ అడిగాడు. “నాకు లేదు.. నేను సింగిల్..” అంటూ నబీల్ చెప్పాడు. తర్వాత నైనిక కోసం ఓ పాట పాడమంటూ నబీల్‌ను కోరాడు బిగ్‌బాస్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version