Entertainment

మాజీ మంత్రి రోజా వార్నింగ్.. అవన్నీ డిలీట్ చేయండి..

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. రోజా యూట్యూబ్ ఛానెల్ ద్వారా పోల్ నిర్వహించారంటూ.. కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాలన మీద, తిరుమల లడ్డూ వివాదంపైనా రోజా పోల్ నిర్వహించినట్లు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రోజా కీలక ప్రకటన చేశారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని రోజా సెల్వమణి స్పష్టం చేశారు. తన పేరు మీద ఉన్న ఛానెల్స్, అకౌంట్లు డిలీట్ చేయాలని హెచ్చరించాలు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

“అందరికీ నమస్కారం. నా మిత్రులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. దయచేసి గమనించగలరు. నా పై ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్‌లను డిలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారిక వెరిఫైడ్ అకౌంట్(బ్లూటిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను.” అంటూ రోజా ట్వీట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version