Telangana

మూసీ ప్రక్షాళన.. కేటీఆర్‌పై మండలి ఛైర్మన్ గుత్తా ఆగ్రహం..

తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం హాట్ టాఫిక్‌గా మారింది. దీని చుట్టే ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ నిర్వహించి.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మూసీ సుందరీకరణ కాదని.. పునర్జీవనం చేస్తున్నామని చెప్పారు.దాన్ని అడ్డుకోవాలని కేటీఆర్, హరీష్, ఈటల ఒకరోజు నది ఒడ్డున నిలబడి ఉండాలని సవాల్ విసిరారు. ఇక రేవంత్ చేసిన ప్రెస్‌మీట్‌కు ప్రతిగా, నేడు బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది.

మూసీ ప్రక్షాళన విషయంలో తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు. గతంలో కేటీఆర్ చేసిన కొన్ని తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని ఆయనపై మండిపడ్డారు. హైదరాబాద్‌ నగరం మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్తిగా బాగు కావాలంటే, మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని చెప్పారు. మూసీ కాలుష్యం మొత్తం నల్లగొండ జిల్లాకే వస్తోంది అని ఛైర్మన్ గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా మూసీ ప్రక్షాళనకు బోర్డు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల రక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రాను ఆయన స్వాగతించారు. అక్రమాల కూల్చివేతల్లో వేగం పెంచి పనిచేయాలని హైడ్రా అధికారులకు సూచించారు. మూసీ ఒడ్డున ప్రజల దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్నారని.. మూసీ ప్రక్షాళన ద్వారా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి హైదరాబాద్ ఎదుగుతుందని ఛైర్మన్ గుత్తా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version