Telangana

పంజాగుట్ట శ్మశానంలో చెత్తపనులు.. ఏమాత్రం భయం లేకుండా..

పట్టపగలు.. అది కూడా శ్మశానంలో.. చుట్టూ సమాధులు.. అయినా వాళ్ళు ఎం పట్టిచుకోలేదు. వాళ్లున్నది శ్మశానమే అయినా.. స్వర్గంలో తేలియాడుతున్న అనుభూతి పొందుతున్నారు. వాళ్లు కూర్చుంది ఓ సమాధిపైనే అయినా.. పూలపాన్పు మీద ఉన్నట్టే  ఫీలవుతున్నారు. చుట్టూ సమాధులున్నా.. ఎవరైనా చూస్తారేమో అన్న భయాలు ఏమాత్రం వాళ్లకు లేవు.. ఎంచక్కా ఇద్దరూ ఓ సమాధిపై కూర్చొని తమ పని తాము కానిచ్చేస్తున్నారు. అదేనండి గంజాయి కొడుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట శ్మశానంలో పట్టపగలే చోటుచేసుకుంది. ఓ ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు.. శ్మశానంలో ఓ సమాధిపై కూర్చొని గంజాయి కొడుతూ కనిపించారు.

ఇద్దరు యువకులు శ్మశానంలో ఓ సమాధిపై కూర్చొని ఉండటాన్ని.. పక్కనే ఉన్న ఓ ప్రైవేటు కార్యాలయంలోని ఉద్యోగులు గమనించారు. పొద్దుపొద్దున్నే ఆ యువకులు అక్కడ ఏం చేస్తున్నారని తీక్షణంగా వీక్షిస్తే గానీ అసలు విషయం అర్థంకాలేదు. వెంటనే మొబైల్ తీసి వీడియో తీశారు. ఆ యువకులు పంజాగుట్ట పరిసరాల్లో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్థులుగా అర్ధమవుతుంది. ఎక్కడ గంజాయి తాగినా దొరికిపోతామనుకున్నారో.. ఇదే సేఫ్ ప్లేస్ అనుకున్నారో.. ఎవరూ ఊహించని ప్రదేశమైన శ్మశానంలోనే పని కానిచ్చేశారు. కాలేజీ విద్యార్థులు పట్టపగలే ఇలా గంజాయి సేవించటం.. అది కూడా శ్శశానంలో.. ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా సేవిస్తుండటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే.. తెలంగాణలో యువత పక్కదారి పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ వేదికపై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సరైన లక్ష్యం లేకనో.. మార్గనిర్దేశం చేసే వారులేక పోవటమో.. చెడు సావాసాల వల్లో.. ఏం చేసినా చెల్లుతుందన్న లెక్కలేనితనమో.. కారణమేదైనా.. కొంతమంది యువకులు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని.. గంజాయి, డ్రగ్స్, మద్యం లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి చిత్తవుతున్నారని బాధ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేవలం మాదకద్రవ్యాలకు బానిసలవటమే కాకుండా మత్తులో నేరాలకు పాల్పడుతూ.. భవిష్యత్తును పాడు చేసుకుంటున్న ఘటనలు ఇప్పటికే చాలా వెలుగుచూశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version