Latest Updates

ఎన్‌కౌంటర్‌లో 171 మంది మావోయిస్టులు హతం..పోలీసులు ప్రత్యేక వ్యూహాలు

మవోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. వారిని పూర్తిగా అంతమొందించేందుకు అడవుల్లో జల్లెడ పడుతున్నారు. గత కొద్ది రోజులుగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి మావోయిస్టులను మట్టుబెడుతున్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్లో భారీగానే మావోయిస్టులు మృతి చెందారు

దండకారణ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లతో భారీ మావోయిస్టులు హతమవుతున్నారు. మవోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. వారిని పూర్తిగా అంతమొందించేందుకు అడవుల్లో జల్లెడ పడుతున్నారు. గత కొద్ది రోజులుగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి మావోయిస్టులను మట్టుబెడుతున్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్లో భారీగానే మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులపై ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ నిర్వహించాయి. నారాయణపూర్- దంతేవాడజిల్లా సరిహద్దులో నక్సలైట్ల ,భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 40 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. ఇప్పటివరకు 30 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు చాలా ఆటోమేటెడ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ- నారాయణపూర్ సరిహద్దులోని ప్రాంతంలో నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నక్సలైట్లు పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్న పక్కా సమాచారంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు

రంగంలోకి దిగారు. అయితే జవాన్లు రావడం చూసి నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. సైనికులు కూడా ప్రతీకారం తీర్చుకున్నారు.

భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 30 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లో 40 మంది హతమైనట్లు అంచా వేయగా, ఇంకా ఎక్కువ మందే హతమై ఉంటాయరని బలగాలు భావిస్తున్నాయి. ఎంత మంది నక్సలైట్లు హతమయ్యారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో విచారణ కొనసాగుతోంది.

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు

నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవరావు, మిలిటరీ కమిషన్‌ ఇనఛార్జ్‌ ఆశన్న కూడా ఉన్నట్లు సమాచారం. అయితే నంబళ్ల కేశవరావు, ఆశన్న హతమయ్యారా? లేక తప్పించుకున్నారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వీరి ఆచూకీపై పోలీసులు ఇంకా స్పందించలేదు.

171 మంది మావోయిస్టులు హతం

ఈ ఏడాది లో ఈ ఎన్‌కౌంటర్‌తో ఇప్పటివరకు నారాయణపూర్‌,దంతెవాడ తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు 171 మంది మావోయిస్టులను హతమార్చాయని పోలీసు అధికారులు తెలిపారు.

2026 నాటికి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో మావోయిస్టులను అంతమొందించేందుకు ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని రూపొందించింది. దీని కింద మరో 4 సీఆర్పీఎఫ్ బెటాలియన్లను బస్తర్‌లో మోహరిస్తున్నారు. బస్తర్‌లోని వివిధ జిల్లాల్లో సుమారు 4 వేల మంది సైనికులు నక్సల్ ఫ్రంట్‌లో మోహరిస్తారు. వీటిలో జార్ఖండ్‌ నుంచి 3, బీహార్‌ నుంచి 1 బెటాలియన్‌లను పంపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version