Business

సీక్రెట్ ప్రాపర్టీ కొన్న మస్క్, మాజీ భార్యలు, 11 మంది పిల్లలంతా ఒకే దగ్గర ఉండేలా వందల కోట్లతో భవనం

సీక్రెట్ ప్రాపర్టీ కొన్న మస్క్, మాజీ భార్యలు, 11 మంది పిల్లలంతా ఒకే దగ్గర ఉండేలా వందల కోట్లతో భవనం..

ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ వంటి అనేక సంస్థల అధినేత. ఆయన సంపద రూ. 22 లక్షల కోట్లను మించిపోయింది. ఈయన దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు  ఎలాన్ మస్క్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, అది సంచలనంగా మారుతుంది. మస్క్‌కు 11 మంది పిల్లలు ఉన్నారు. వీరందరినీ ఒకే చోట చేర్చడానికి ఆయన ప్లాన్ చేస్తునాడు.  ఈయన వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు

మస్క్‌ చాలా మందిని వివాహం చేసుకొని వారికి  విడాకులు ఇచ్చారు. కొందరితో సహజీవనం చేశారు. ఆయన భార్యల ద్వారా మస్క్‌కు దాదాపు 12 మంది పిల్లలు ఉన్నారు అందులో ఒకరు చనిపోయారు ప్రస్తుతం ఆయనకి 11 మంది పిల్లలు . ఇప్పుడు వారందరినీ ఒకచోటుకి చేర్చాలని మస్క్‌ అభీప్రాయం వారందరి కోసం మస్క్‌ ఒక కొత్త భవనం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భవనం విలువ సుమారు రూ. 300 కోట్లు. ఇది అమెరికాలోని టెక్సస్ రాష్ట్రానికి చెందిన ఆస్టిన్‌లో ఉంది.

మస్క్‌ మొదటి భార్య జస్టిన్‌కు మొదటి బిడ్డ అనారోగ్యం కారణంగా చనిపోయాడు, అందుకే ఇప్పుడు 11 మంది పిల్లలు ఉన్నారు. మస్క్‌ జస్టిన్‌ తరువాత ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చాడు. 2008లో వారు విడిపోయారు. తర్వాత ఆయన బ్రిటిష్ నటి తాలులాహ్ రిలేను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు.

తరువాత, మస్క్ కెనడాకు చెందిన సింగర్ గ్రిమ్స్‌తో సహజీవనం చేశాడు, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదనంగా, మస్క్ తన సంస్థ న్యూరాలింక్‌లో పని చేసే ఎగ్జిక్యూటివ్‌తో మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడని ఇటీవల వెల్లడించాడు. ప్రస్తుతం మస్క్ తన 11 మంది పిల్లలందరినీ ఒకే చోట చేర్చాలనుకుంటున్నారు. ఈ కొత్త భవనంలో 14,400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నట్లు సమాచారం. 6 బెడ్ రూంలతో కూడిన ఇంటిని మస్క్ కొనుగోలు చేసినట్లు తెలిస్తుంది టెక్సాస్‌లో మస్క్ నివసిస్తున్న ఇంటికి సమీపంలోనే ఈ కొత్త భవనం ఉంది.

మస్క్-జస్టిన్ దంపతులకు జన్మించిన జేవియర్ అలెగ్జాండర్ ఇటీవల అమ్మాయిగా మారారు. తన తండ్రితో కలిసి జీవించాలి అనుకోవట్లేదు  అని తానా రూపనే మార్చుకున్నాడు , ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version