Entertainment

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్ 9లోకి మరో సీరియల్ బ్యూటీ ఎంట్రీ.. ఈ సారి గేమ్ మస్త్ ఫైర్!

Bigg Boss Telugu 9: 15 commoners rumoured to enter 'Agni Pariksha'  challenge? - Times of India

బుల్లితెరపై రియాల్టీ షోలలో దుమ్మురేపే షో ఏదైనా ఉందంటే అది బిగ్‌బాస్నే. ఇప్పటికే హిందీ, మలయాళం భాషల్లో కొత్త సీజన్లు స్టార్ట్ అయి సందడి చేస్తున్నారు. ఇక టాలీవుడ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కూడా మొదలుకాబోతుంది.

ఇప్పటివరకు వచ్చిన ఎనిమిది సీజన్లు జనాలకు మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి. అందుకే ఇప్పుడు సీజన్ 9పై హైప్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. షో ఎప్పుడు మొదలవుతుందోనని, ఎవరు ఎంటర్ అవుతారోనని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీ పేర్లు నెట్టింట గాసిప్‌లా చక్కర్లు కొడుతున్నాయి. సినిమా హీరోలు, హీరోయిన్లు, సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలా విభిన్న రంగాల నుంచి కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో బ్యూటీ పేరు కూడా వచ్చేసింది. ఆమె ఎవరో కాదు.. ముద్ద మందారం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసిన తనూజ గౌడ్. నిజానికి కన్నడకు చెందిన ఈ క్యూటీ.. ఒకే సీరియల్‌తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. అప్పటి నుంచి మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

ఇక ఇప్పుడు ఆమె బిగ్‌బాస్ 9లో ఎంటర్ అవుతోందన్న టాక్ కన్‌ఫామ్ అయ్యింది. ఈ సీజన్‌లో ఆమె ఎంట్రీతో గేమ్ ఇంకా హైలైట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version