Entertainment

బాలకృష్ణని ఇరికించాలని చూసిన రిపోర్టర్.. పక పక నవ్విన మీనాక్షి

నందమూరి బాలకృష్ణ ఎంత సరదాగా ఉంటాడో.. అంతే సీరియస్‌గా ఉంటాడు. బాలయ్య ఫన్నీ వీడియోలు, ట్రోలింగ్ వీడియోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంటాయి. బాలయ్య అసహనానికి గురైతే ఎవరికో మూడినట్టే. మంచి మూడ్‌లో ఉన్నాడంటే.. అవతలి వాడికి మాటల పంచ్ పడుతుంది.. లేదంటే చేతితో కూడిన పంచ్ పడుతుంది. తాజాగా బాలయ్య సరదాగా కనిపించాడు. రిపోర్టర్‌కు నవ్వుతూ పంచులు వేశాడు. మామూలుగా అయితే బాలయ్య బాబు ఇలా షాపింగ్ మాల్స్ అంటూ బయట తిరగడు.

బాలయ్య తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేశాడు. మీనాక్షి చౌదరితో కలిసి బాలయ్య ఇలా నవ్వులు పూయించాడు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం తరువాత.. మీడియాతో ముచ్చటించారు. అప్పుడే అందులోంచి ఓ మీడియా వ్యక్తి బాలయ్యను ఇరకాటంలో పెట్టే ప్రశ్న అడిగాడు. మేడంకి ఎప్పుడైనా చీర కొన్నారా? అని అడిగాడు. దీంతో బాలయ్య కౌంటర్లు వేశాడు. ఇప్పుడు అవసరమా? అది.. అనవసరంగా పుల్లలు పెట్టడం కాకపోతే అంటూ నవ్వించేశాడు. బాలయ్య మాటలకు అక్కడి వారంతా నవ్వేశారు. ఇక బాలయ్య పక్కన కూర్చున్న మీనాక్షి అయితే పగలబడి నవ్వేసింది.

 

బాలయ్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. బాలయ్య బాబు చివరగా వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి అంటూ రెండు హిట్లు కొట్టేశాడు. అంతకు ముందు అఖండ అంటూ అదరగొట్టేశాడు. ఇప్పుడు బాలయ్య బాబీతో కలిసి మూవీని చేస్తున్నాడు. ఆ తరువాత అఖండ 2 ఉంటుందని సమాచారం.

వచ్చే సంక్రాంతికి బాలయ్య బరిలోకి దిగబోతోన్నాడు. బాబీ తీస్తున్న మూవీని సంక్రాంతికి దించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి అయితే బాలయ్య బాబు సంక్రాంతి రేసులో ఒక కర్చీప్ వేసి ఉంచాడు. చివరి వరకు ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుత్తం బాలయ్య అటు పొలిటికల్‌గా, ఇటు సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య బాలయ్య కూడా యాడ్స్ అంటూ సందడి చేస్తున్నాడు. కాకపోతే ఏది పడితే అది చేయకుండా యాడ్స్ చేయడంలో బాలయ్య చాలా సెలెక్టివ్‌గా ఉంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version