Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం..

Visakhapatnam Pv Sindhu Land Controversy:విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం బ్మాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం మొదలైంది.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన స్థలంపై వివాదం మొదలైంది. పీవీ సింధు ప్రారంభించే  అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కోసం విశాఖపట్నంలోని తోటగురువులో గత జగన్  ప్రభుత్వం ఈ స్థలం కేటాయించింది. ప్రస్తుతం ఆ స్థలంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ స్థలంలో జూనియర్ కళాశాల ను  నిర్మించాలంటూ నిరసనకు దిగారు. గతంలోనే జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరారు. ఎట్టిపరిస్థితుల్లో జూనియర్ కాలేజ్‌కు కేటాయించాలని నిర్మాణ పనులు start చేయాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గత జగన్  ప్రభుత్వం జూన్‌ 2021 లో పీవీ సింధుకు విశాఖపట్నం, చినగదిలి మండలంలో రెండు ఎకరాలు భూమిని కేటాయించింది. అక్కడ బ్మాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని ఇచ్చారు. అక్కడ 73/11,83/5, 6 సర్వే నెంబర్లలో పశుసంవర్థక శాఖకు చెందిన మూడు ఎకరాల స్థలంలో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయించారు. ఈ మేరకు అప్పుడే రెవెన్యూ శాఖ మరియు  ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత క్రీడల వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాల భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం కేటాయించింది.

ఈ స్థలానికి సంబంధించి.. అకాడమీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, మూడేళ్లకు ఐటీ రిటర్న్స్ సమర్పించడంతో పాటుగా నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తి చేశాక పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీకి బదలాయించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే బ్మాడ్మింటన్ అకాడమీ అవసరాల కోసమే ఆ భూమిని వినియోగించాలని.. కమర్షియల్‌ అవసరాల కోసం వినియోగించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా గత ప్రభుత్వం ప్రస్తావించింది. స్థలం కేటాయించడంపై పీవీ సింధు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా పీవీ సింధుకు కేటాయించిన స్థలాన్ని జూనియర్ కాలేజీకి కేటాయించాలంటూ స్థానికులు వెంటనే నిర్మాణ పనులు చెప్పల ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైమంది. ఈ స్థలం వ్యవహారంపై బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చంద్రబాబు ప్రభుత్వం, ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

మరోవైపు పీవీ సింధు ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే ఆ  సదుపాయాన్ని మరో ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఆమె హైదరాబాద్‌లో, ఏపీ అధీనంలోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ ఓఎస్డీగా ఉన్నారు. ఈ మేరకు పీవీ సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యం  30  సెప్టెంబర్‌2025 వరకు పొడిగించింది ప్రభుత్వం. ఆమెకు వరుసగా ఆరోసారి ఆన్‌డ్యూటీ సౌకర్యం పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ కోసం పీవీ సింధుకు ఓడీ సౌకర్యం పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version