Andhra Pradesh

కర్నూలు: హాస్టల్‌ కూరలో మందులు కలిపిన విద్యార్థులు.. 9 మందికి అస్వస్థత, కారణం తెలుసుకొని ఆశ్చర్యం.

కర్నూలు: హాస్టల్‌ కూరలో మందులు కలిపిన విద్యార్థులు.. 9 మందికి అస్వస్థత, కారణం తెలుసుకొని ఆశ్చర్యం.

కర్నూలులో ఇద్దరు విద్యార్థులు చేసిన తప్పుడు పనికి తోటి విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లారు. కర్నూలు సి క్యాంపులో ప్రభుత్వ బాలల వికలాంగుల హాస్టల్‌ ఉంది. ఈ హాస్టల్‌లో వివిధ తరగతులు చదువుతున్న 30 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఒక పీజీ విద్యార్థి కూడా ఉంది. అతడు తరచూ విద్యార్థుల మధ్య వివాదాలకు కారణమవుతున్నాడు. హాస్టల్‌లో విద్యార్థుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ గొడవల కారణంగా పీజీ విద్యార్థి, 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడితో కలిసి ఒక ప్రణాళిక వేసాడు. తోటి విద్యార్థులపై కోపంతో.. శనివారం రాత్రి హాస్టల్‌‌లో వండిన సొరకాయ కూరలో గుర్తుతెలియని మాత్రలు కలిపేశారు. కొద్దిసేపటి తర్వాత ఈ సొరకాయ కూర తిన్న వారిలో తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు సమయానికి చికిత్స అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇటీవల పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఇద్దరు బాలులు పందెం వేసుకుని చాలా ఐరన్‌ మాత్రలు మింగారు. వారిలో ఒకరు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. పల్నాడు జిల్లా ఈపూరు ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు హని గురు, సతీష్‌లు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. పాఠశాలలో వైద్య సిబ్బంది ఐరన్‌ మాత్రలు పంపిణీ చేయగా.. వీరిద్దరు ఎవరు ఎక్కువ మాత్రలు మింగితే వారు గెలిచినట్లుగా పందెం పెట్టుకున్నారు. హని గురు 20, సతీష్‌ 10 మాత్రలు మింగారు. కానీ సాయంత్రం హని గురు స్కూల్ గ్రౌండ్‌లో అస్వస్థతతో కిందపడిపోయాడు. వెంటనే గమనించిన తోటి విద్యార్థులు అక్కడ టీచర్లకు సమాచారం ఇవ్వగా.. అతడిని ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సతీష్‌ కూడా ఎక్కువ మాత్రలు మింగాడని తెలిసి, ఆ విద్యార్థిని నరసరావుపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఇద్దరు కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version