Entertainment

యాంకర్‌ ప్రదీప్‌ సినిమా.. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్‌ టైటిల్‌..

తెలుగు టీవీ ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీలో చాలా కాలం నుండి ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు, కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి సుపరిచితుడయ్యాడు. యాంకర్‌గా ప్రదీప్‌కు స్టార్‌డమ్ వచ్చింది. దాంతో, హీరోగా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా, సినిమా సంగీతం కూడా మంచి హిట్ అయ్యింది. చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రదీప్ మాచిరాజు సెకండ్ మూవీ ఎప్పుడు వస్తుందో అంటూ చర్చ జరుగుతోంది.

ప్రదీప్ హీరోగా చేసిన మొదటి సినిమా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు ప్రదీప్ సెకండ్ సినిమా ప్రకటించకపోవడంతో, అతనికి హీరోగా సినిమాలు చేయడం ఇష్టం లేదేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. సినిమా చేసిన తర్వాత మళ్లీ యాంకర్‌గా కొన్ని షోలు చేశారు. కానీ గత కొన్ని నెలలుగా ప్రదీప్ టీవీ షోల్లో కనిపించకపోవడంతో మళ్లీ సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయం క్లియర్ అయింది. ప్రదీప్ ఎట్టకేలకు హీరోగా తన రెండో సినిమాకు కమిట్ అయ్యారు. ఈసారి వైవిధ్యమైన కథతో, మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రదీప్ ప్రస్తుతం చేస్తున్న రెండో సినిమాకు టైటిల్‌గా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొదటి సినిమా టైటిల్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే విషయం తెల్సిందే. పవన్‌ మూవీ టైటిల్‌ అవ్వడం వల్ల మంచి ఆసక్తి కలగడం ఖాయం. టైటిల్‌కి మంచి స్పందన వస్తే, సినిమాకి పాజిటివ్ టాక్‌ వస్తే, మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రదీప్‌ రెండో సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ప్రదీప్‌ రెండో సినిమా గురించి పలు విషయాలు ప్రచారం అవుతున్నాయి.

“30 రోజుల్లో ప్రేమించడం ఎలా”లో అమృత అయ్యర్‌తో నటించిన ప్రదీప్ మాచిరాజు, తన రెండో సినిమాలో మరో కొత్త హీరోయిన్‌తో నటించే అవకాశం ఉంది.జబర్దస్త్ షో ద్వారా దర్శకులుగా పరిచయం అయిన నితిన్‌, భరత్‌లు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రదీప్‌తో నితిన్‌, భరత్‌లు మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నారు. వీరు ఇప్పటికే పలు కామెడీ, రియాల్టీ షోలను హిట్‌ చేశారు, ఇప్పుడు సినిమాతో కూడా విజయాన్ని సాధిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version