Latest Updates

హైదరాబాద్‌ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక: కాసేపట్లో భారీ వర్షం

Hyderabad Rains,Hyderabad: భారీ వర్షం.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్..  నగరవాసులూ జాగ్రత్త - meteorological department issues red alert to hyderabad  heavy rain in city - Samayam Telugu

హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడనుందని అంచనా వేసింది. వర్ష ప్రభావంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగొచ్చని అధికారులు తెలిపారు.

GHMC అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా స్కూలు, ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరే వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. వర్ష సమయంలో రహదారుల పరిస్థితి మారే అవకాశం ఉండటంతో ప్రయాణాల్లో ఆలస్యం తప్పకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రెయినేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్టు GHMC తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version