Business

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు: దేశంలోనే టాప్‌.. ముంబై, బెంగళూరు కంటే మన దగ్గరే ఎక్కువ సేల్స్!

ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక ప్రకారం, భారతీయ ఇళ్ల విక్రయాల మార్కెట్‌లో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో విక్రయాలు మందగించినా, హైదరాబాద్‌లో మాత్రం రెండంకెల వృద్ధి నమోదు కావడం విశేషం.

వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 12 శాతం వృద్ధి చెంది, 18,262 యూనిట్లుగా నమోదయ్యాయి. 2025 ద్వితీయార్థంలోనూ (H2) 13 శాతం వృద్ధితో నగరం దూసుకుపోయింది.మెట్రో నగరాల పరిస్థితి: ముంబైలో అమ్మకాలు కేవలం 1 శాతం మాత్రమే పెరగ్గా, బెంగళూరులో స్థిరంగా (0% వృద్ధి) కొనసాగాయి. పూణె (-3%), చెన్నై (-3%), ఎన్సీఆర్ (-9%) ప్రాంతాల్లో విక్రయాలు పడిపోవడం గమనార్హం.లగ్జరీ ఇళ్లకే మొగ్గు: దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఇళ్లలో రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ల వాటా 50 శాతానికి చేరింది. అయితే, సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్ల విక్రయాలు 17 శాతం మేర తగ్గాయి.స్థిరమైన మార్కెట్: 2025 ద్వితీయార్థంలో మొత్తం 1,78,046 యూనిట్లు అమ్ముడవగా, అందులో హైదరాబాద్ అత్యధిక వృద్ధి రేటును కనబరిచి ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version