Latest Updates
హైదరాబాద్: భారీ వర్షాల హెచ్చరిక – సైబరాబాద్ పోలీసుల సూచనలు
హైదరాబాద్ నగరం మరియు రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు మరింత తీవ్రతరంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
వీలైనంతవరకూ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని అనుసరించాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకి రావద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ సూచనలు పాటించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోరారు.