Telangana

హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మరో 2 మల్టీప్లెక్స్‌లు.. అక్టోబర్‌లోనే ప్రారంభం

RTC X Road Steel Bridge Flyover In Hyderabad, Photos Goes Viral - Sakshi

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇప్పటికే 18 థియేటర్లు ఉన్నాయి. ఇక త్వరలోనే ఈ ప్రాంతంలో మరో రెండు మల్టీప్లెక్సులు రానున్నాయి. వీటిల్లో ఒకటి అక్టోబర్ నెలలోనే ప్రారంభం కాబోతుంది. ఇంతకు ఆ రెండు మల్టీప్లెక్సులు ఏవంటే.. ఓడియన్ మల్టీప్లెక్స్. ఇది 8 స్క్రీన్లతో అక్టోబర్ 24న ప్రారంభం కాబోతుంది. అలానే, మహేష్ బాబుకు చెందిన AMB క్లాసిక్ 7 స్క్రీన్లతో 2026 సంక్రాంతికి అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు..

హైదరాబాద్‌ ఎంత అభివృద్ధి చెందినా.. నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‌లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజే వేరు. భాగ్యనగరంలోకి ఎన్ని మల్టీప్లెక్సులు వచ్చినా సరే.. మూవీ లవర్స్ తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కే ఓటేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. నగరంలోని సినిమా థియేటర్లకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. హృదయం వంటింది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే మరో రెండు మల్టీప్లెక్సులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తమ కొత్త బ్రాంచులను తెరిచేందుకు సిద్ధమయ్యాయి. వీటిల్లో ఒక మల్టీప్లెక్స్‌ అక్టోబర్‌లోనే అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు..

హైదరాబాద్ , ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇప్పటికే సంధ్య, దేవీ, ఓడియన్, సుదర్శన్ వంటి ఐకానిక్ సింగిల్ స్కీన్ సినిమా థియేటర్లు ఉన్నాయి. నగరంలోని సినిమా థియేటర్లకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రెస్ అని చెప్పవచ్చు. సినీ లవర్స్‌కు హైదరాాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ప్రత్యేకమైన అభిమానం.ఇప్పటికే ఇక్కడ 18 థియేటర్లు ఉండగా.. ఇప్పుడు వీటి సరసన మరో రెండు సినిమా హాళ్లు చేరబోతున్నాయి. అవి కూడా మల్టీప్లెక్సులు కావడం విశేషం. ఇందులో ఒకటి ఓడియన్ మల్టీప్లెక్స్.. అక్టోబర్ 24, 2025న ప్రారంభం కానుంది.

ఓడియన్ థియేటర్.. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్‌గా ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఇది 8 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌గా అప్‌గ్రేడ్ అయింది. ప్రొజెక్షన్, విశాలవంతమైన సీటింగ్, మల్టీలెవల్ పార్కింగ్‌తో పునర్నిర్మించారు. అలానే థియేటర్ లోపల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. దీంతో మూవీ చూడటమే కాక.. సినిమాలు, షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ మల్టీప్లెక్స్ వచ్చే నెల అనగా అక్టోబర్, 24న ఈ మూవీ లవర్స్ కోసం అందుబాటులోకి రానుంది. .

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రారంభించబోయో మరో థియేటర్ AMB క్లాసిక్. ఇది వచ్చే సంవత్సరం అనగా 2026 సంక్రాంతి సందర్భంగా ప్రారంభం కానుంది. సుదర్శన్ 70ఎంఎం కాంప్లెక్స్ ఉన్న ప్రాంతంలోనే ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. దీనిలో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో 7 స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించబోయే మొదటి చిత్రం ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్ అని భావిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. AMB క్లాసిక్ ఇప్పటికే పీవీఆర్, ఐనాక్స్ వంటి పెద్ద థియేటర్లతో పోటీ పడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఓడియన్, ఏఎంబీ క్లాసిక్‌తో RTC X రోడ్స్‌లో మూవీ థియేటర్ల సంఖ్య 18-20 కి పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version