Andhra Pradesh

హైదరాబాద్‌లో బక్రీద్ సందడి: పొట్టేళ్లకు గిరాకీ జోరు

Hyderabad: పాతబస్తీలో బక్రీద్‌ సందడి.. | Bakrid 2025 Celebrations Begin in  Hyderabad Old City with Surge in Goat and Sheep Sales ksv

హైదరాబాద్ నగరంలో బక్రీద్ పండగ సందడి ఊపందుకుంది. ఖుర్బానీ కోసం ముస్లిం సోదరులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని మలక్పేట్, సైదాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే పొట్టేళ్ల స్టాళ్లు విరివిగా ఏర్పాటయ్యాయి. రేపు బక్రీద్ పండగ కావడంతో ఈ స్టాళ్ల వద్ద గొర్రెలను కొనుగోలు చేసేందుకు ముస్లిం సోదరులు బారులు తీరుతున్నారు.

మార్కెట్‌లో ఒక్కో గొర్రె ప్రారంభ ధర రూ.10,000 నుంచి మొదలవుతోంది. భారీ ఆకారంలో ఉన్న పొట్టేళ్లు రూ.20,000కి పైగానే అమ్మకానికి ఉంటున్నాయి. ఈ ఏడాది పొట్టేళ్లకు గిరాకీ గత సంవత్సరాలతో పోలిస్తే బాగానే ఉందని వ్యాపారులు తెలిపారు. పండగ సీజన్‌తో నగరంలో సందడి నెలకొనడంతో పాటు, వ్యాపారం కూడా జోరందుకుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మార్కెట్‌లో జనసంద్రత పెరిగింది, అయితే అధిక ధరలు కొంతమంది కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. అయినప్పటికీ, బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ కోసం గొర్రెల కొనుగోలు జోరుగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version