National

హైదరాబాద్‌లో నేడు మాక్ డ్రిల్

Mock Drill

హైదరాబాద్‌లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో మాక్ డ్రిల్ జరగనుంది. అత్యవసర సమయాల్లో, ముఖ్యంగా వైమానిక దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి, భద్రతా బృందాలు ఎలా రక్షణ కల్పిస్తాయి అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. సికింద్రాబాద్, కంచనబాగ్ డీఆర్‌డీఓ, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీ, గోల్కొండలో ఈ డ్రిల్ నిర్వహిస్తారు. పన్నెండు విభాగాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సైరన్లు మోగగానే ప్రజలు సురక్షిత ప్రదేశంలో ఆశ్రయం పొందాలని, గ్యాస్, విద్యుత్ ఉపకరణాలను ఆపివేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ డ్రిల్ దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో జరుగుతున్న ‘ఆపరేషన్ అభ్యాస్’లో భాగం. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవలి ఉగ్రదాడి, ఇండో-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలీసు, ఫైర్ సర్వీస్, వైద్య బృందాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ విభాగాలు కలిసి పనిచేస్తాయి. సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు సహాయక బృందాలు రక్షణ చర్యలు మొదలుపెడతాయి, నాలుగు గంటల ముప్పై నిమిషాలకు డ్రిల్ ముగుస్తుంది. ప్రజలు సహకరించాలని, అధికారిక సమాచారాన్ని నమ్మాలని అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version