Latest Updates
హైదరాబాదుకు రాబోతున్న అమిత్ షా – వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొననున్నారు
వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న హైదరాబాద్ రాబోతున్నారు.
ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, ముందుగా పార్టీ నాయకులతో భేటీ అవుతారు. అనంతరం, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం 1 గంటకు చార్మినార్ వద్ద నిమజ్జన ఊరేగింపులో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు ఎంజేగా మార్కెట్ వద్ద శోభాయాత్రలో ప్రసంగం కూడా ఇవ్వనున్నారు.