Latest Updates

హైడ్రా జోలికి వెళ్లం: కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ

Hydra: ఆ నిర్మాణాల జోలికి వెళ్లం.. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్  క్లారిటీ

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గత ఏడాది జూలై 19న ఏర్పడిందని, అంతకు ముందు నిర్మితమైన నివాస ప్రాంతాలు లేదా అనుమతులతో నిర్మాణ దశలో ఉన్న భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత అక్రమంగా నిర్మించిన కట్టడాలను మాత్రం తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్యుయేషన్ (IOV) హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ‘ట్రాన్స్‌ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో రంగనాథ్ మాట్లాడారు. హైడ్రా లక్ష్యాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలకు సంబంధించిన విధానాలను ఆయన వివరించారు. నగరంలో చట్టవిరుద్ధ నిర్మాణాలను అరికట్టేందుకు హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుందని, అయితే చట్టబద్ధమైన నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆయన భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version