Latest Updates

సైబరాబాద్‌లో 24వ తేదీ వరకు నిషేధాజ్ఞలు: సీపీ అవినాశ్ మహంతి

Maintaining Law and Order: Avinash Mohanty's Section 144 Cr.P.C Orders – Hyderabad Mail

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచేందుకు BNSS సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు నిబంధనలకు సహకరించాలని సీపీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version