Latest Updates
సిరిసిల్ల జిల్లాలో దారుణం: మహిళ తల నరికి హత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చందుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో మనోజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ (60) అనే మహిళను అతికిరాతకంగా హత్య చేశాడు. హత్య అనంతరం, నిందితుడు మనోజ్ వేట కొడవలితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, “పెద్దమ్మ గుడి వద్ద ఆమె తల, చేతులు నరికి చంపేశా సార్” అని స్వయంగా తెలిపాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా స్పష్టం కాకపోగా, గత ఏడాది వినాయక చవితి రోజున కూడా మనోజ్ ఒక వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది.