Devotional
శ్రీశైలం: నవ దుర్గల అలంకారాలు.. విశిష్టత!

1. శైలపుత్రి: సతీదేవి అగ్నిలో దూకి ఆహుతి చేసుకున్న తర్వాత హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించారు. ఈమె త్రిశూలం, కమలంతో వృషభ వాహనంపై దర్శనమిస్తారు. శైలపుత్రి దర్శనం కల్యాణ యోగాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.
2. బ్రహ్మచారిణి: పార్వతీదేవి జపమాల, కమండలం ధరించి శివుడి కోసం తపస్సు చేసిన రూపం బ్రహ్మచారిణి. ఈమె స్వరూపాన్ని దర్శించి, పూజిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.