Devotional

శ్రీవారి లడ్డూ పవిత్రతపై టీటీడీ కీలక నిర్ణయం: నాణ్యత కోసం కొత్త నిబంధనలు!

తిరుమల లడ్డూ నాణ్యతపై గతంలో వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత బోర్డు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, కల్తీకి తావులేకుండా విప్లవాత్మక మార్పులు చేపట్టింది.

టీటీడీ చేపట్టిన ప్రధాన మార్పులు, నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు, సేకరణ పరిధిని 1500 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్లకు తగ్గించారు,నెయ్యిని తరలించే ప్రతి ట్యాంకర్‌కు తప్పనిసరిగా జీపీఎస్ లాక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు,కేవలం సాధారణ పరీక్షలే కాకుండా, ISO 17678:2019 ప్రమాణాలతో మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీ పరీక్షలను కఠినతరం చేశారు,డైరీల తయారీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు MRL స్కోర్ బోర్డ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

నందిని డైరీ (KMF): నందిని డైరీని పక్కన పెట్టారనే వార్తల్లో వాస్తవం లేదు, ప్రస్తుతం అవసరమైన నెయ్యిలో 62 శాతం నందిని సంస్థే సరఫరా చేస్తోంది.ధరల పెరుగుదల కారణంగా 2016తో పోలిస్తే పాల ధరలు 147 శాతం పెరగడం వల్లే నెయ్యి ధర కూడా పెరిగిందని, ఇందులో ఎటువంటి కమీషన్ల ప్రమేయం లేదని టీటీడీ స్పష్టం చేసింది.పారదర్శక టెండర్లు మొత్తం 7 విడతలుగా టెండర్లు నిర్వహించి, నందిని, మదర్ డైరీ, సంగం, ఇందాపూర్ వంటి సంస్థలకు పారదర్శకంగా ఆర్డర్లు ఇచ్చారు.శ్రీవారి ప్రసాదాల నాణ్యతను కాపాడటం తమ ప్రథమ కర్తవ్యమని, దీనిపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version