Agriculture

విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు లైన్ క్లియర్: చివరి రైతు కూడా గ్రీన్ సిగ్నల్!

విశాఖపట్నం తర్లువాడ ప్రాంతంలో గూగుల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది. భూసేకరణ విషయంలో ఇన్నాళ్లూ నిరీక్షించిన ప్రభుత్వం, చివరకు మిగిలిన ఒక్క రైతును కూడా ఒప్పించడంలో విజయం సాధించింది.గతంలో ఎకరాకు రూ. 17 లక్షలుగా ఉన్న పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం రూ. 40 లక్షలకు పెంచింది. దీనికి అదనంగా 20 సెంట్ల అభివృద్ధి చేసిన భూమిని కూడా రైతులకు కేటాయించనుంది.

అదనపు భూములు ఇచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం, షాపింగ్ కాంప్లెక్స్‌లలో దుకాణాల కేటాయింపు, మరియు 3 సెంట్ల నివాస స్థలాలను ప్రభుత్వం హామీ ఇచ్చింది,1.94 ఎకరాల భూమి కలిగిన గణేష్ అనే రైతు, తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి తన అంగీకార పత్రాన్ని అందజేశారు. దీంతో 100 శాతం భూసేకరణ పూర్తయ్యింది.విస్తరిస్తున్న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇక్కడ వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏఐ (AI) డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం, గతంలో కేటాయించిన 480 ఎకరాలను ఇప్పుడు 601.40 ఎకరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే విశాఖ గ్లోబల్ ఐటీ హబ్‌గా మారుతుందనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version