Andhra Pradesh

విశాఖలో కాగ్నిజెంట్ భారీ పెట్టుబడి

Cognizant to Establish Rs 1,582 Crore IT Campus in Visakhapatnam

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం త్వరలోనే ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖలో ₹1,5822.98 కోట్ల విలువైన భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే కొన్నేళ్లలో సుమారు 8,000 ఉద్యోగ అవకాశాలు నెలకొననున్నాయి.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్‌కు 21.31 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఈ భూమిని కేవలం 99 పైసల నామమాత్రపు లీజు ధరకు ఇవ్వనుండడం గమనార్హం. ప్రపంచ స్థాయిలో ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఇది దోహదపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version