Andhra Pradesh

విజయవాడలో కొత్త సంవత్సరం సంబరాలు? నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి. విజయవాడ నగర పోలీసులు పూర్తి అప్రమత్తతతో ముందస్తు చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు విధించనున్నామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి భద్రతను కట్టుదిట్టం చేయడమే మా లక్ష్యం అని చెప్పారు.

నగరంలో అర్ధరాత్రి రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించనీయను. యువత గుంపులుగా చేరి కేకులు కట్ చేయడం, వాహనాలతో హడావిడి చేయడం వంటి చర్యలను అరికట్టేందుకు ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీపీ చెప్పారు.

న్యూ ఇయర్ సందర్భంగా విజయవాడలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లతో పాటు నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్లను రాత్రి సమయంలో పూర్తిగా మూసివేస్తామని చెప్పారు. వాహనాల రద్దీని నియంత్రించడం, ప్రమాదాలు జరగకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ ఆంక్షలు జనవరి 1లో పాటు అవసరమైతే మరికొన్ని రోజుల పాటు అమల్లో ఉండవచ్చని సమాచారం.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు అర్ధరాత్రి నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల సైలెన్సర్లను తొలగించడం వల్ల శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వారు పైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, అతివేగం, త్రిబుల్ రైడింగ్ వంటి చర్యల వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని పోలీసులు గుర్తు చేశారు. ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రి సమయంలో బాణాసంచా కాల్చడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.

నూతన సంవత్సరాన్ని ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని విజయవాడ పోలీసులు ప్రజలను కోరారు. భద్రతే లక్ష్యంగా తీసుకున్న ఈ ఆంక్షలు ప్రజల రక్షణ కోసమే. సహకారంతోనే శాంతియుత న్యూ ఇయర్ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.

#VijayawadaPolice#NewYearCelebrations#న్యూ_ఇయర్_ఆంక్షలు#విజయవాడ#PoliceAlert#DrunkAndDrive#RoadSafety
#FlyoversClosed#PublicSafety#YouthAlert#NewYearSafety#AndhraPradeshNews#VijayawadaNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version