Latest Updates

విండీస్ విశ్వరూపం: జింబాబ్వేపై రికార్డు స్థాయి విజయం.. సెమీస్ బెర్తు ఖాయమేనా?

టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

 టీ20 ప్రపంచకప్ చరిత్రలో 250కి పైగా పరుగులు చేసిన రెండో జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. గతంలో 2007లో శ్రీలంక (260/6) మాత్రమే ఈ ఫీట్ సాధించింది, జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు ఏకంగా 19 సిక్సర్లు బాదారు. ఒక ప్రపంచకప్ మ్యాచ్‌లో (ఫుల్ మెంబర్ టీమ్‌పై) అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా విండీస్ రికార్డు నెలకొల్పింది, ఈ టోర్నీలో విండీస్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ (స్కాట్లాండ్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ, జింబాబ్వే) గెలిచి అజేయంగా నిలిచింది.వెస్టిండీస్ సాధించిన ఈ భారీ విజయంతో భారత్‌కు పెరిగిన ఒత్తిడి వారి నెట్ రన్ రేట్ +5.350 కి చేరుకుంది. గ్రూప్-1లో విండీస్ అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే తన తదుపరి మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. విండీస్ తన తదుపరి మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా (జూన్ 26), భారత్ (మార్చి 1) లతో తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version